మ‌హేశ్ ఫ్యాన్స్ కోసం బిగ్ ట్రీట్ రెడీ చేస్తున్న మాట‌ల మాంత్రికుడు!

Share

`స‌ర్కారు వారి పాట‌` హిట్ అనంత‌రం టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హేశ్‌కు ఇది 28వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ఫిబ్ర‌వ‌రిలోనే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.

ఇందులో మ‌హేశ్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈ నెల‌లోనే ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే అత‌డు, ఖ‌లేజా చిత్రాలు వ‌చ్చి.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

మ‌హేశ్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌ల‌పై `భీమ్లా` బ్యూటీ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌!

ఇక‌పోతే ఈ నెల 9వ తేదీన మ‌హేశ్ బాబు పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఫ్యాన్స్ కోసం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ `ఎస్ఎస్ఎమ్‌బీ 28` నుండి బిగ్ ట్రీట్ రెడీ చేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఆ ట్రీట్ మ‌రేంటో కాదు.. మ‌హేశ్ బాబు ఫ‌స్ట్ లుక్ అట‌. అలాగే సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు అనౌన్స్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదే నిజ‌మైతే మ‌హేశ్ ఫ్యాన్స్ పండ‌గా చేసుకోవ‌డం ఖాయం అవుతుంది. కాగా, ఈ మూవీ పూర్తైన వెంట‌నే మ‌హేశ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

 


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

6 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago