Ante Sundaraniki: `శ్యామ్ సింగరాయ్` వంటి హిట్ అనంతరం న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన చిత్రం `అంటే.. సుందరానికీ`. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. వీకే నరేష్, రోహిణి, నదియా, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. రన్ టైమ్ మైనస్‌గా మారినా.. సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ పరంగానే కాకుండా మంచి ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఈ మూవీ బాగానే అలరించింది.
కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం చాలా డల్‌గా ఉన్నాయి. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిని ఈ చిత్రం.. తొలి వారం పూర్తి అయ్యే సమయానికి రూ. 18.56 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టగలిగింది. బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ `మేజర్`, కమల్ హాసన్ `విక్రమ్` చిత్రాలు విద్వంశం సృష్టిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాల నడుమ `అంటే.. సుందరానికీ` నలిగిపోతోంది. ఫస్ట్ వీక్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిత్రానికి ఇంకో వారమే మిగిలింది అని చెప్పాలి. ఈలోపు పుంజుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవ్వలేకపోతే.. ఇక ఆ తర్వాత కష్టమే అని అంటున్నారు. ఏదేమైనా మంచి టాక్ వచ్చినప్పటికీ..నాని రాంగ్ టైమ్‌లో దిగడం వల్ల బయ్యర్లకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…