NewsOrbit
హెల్త్

Guava: పేదవాడి యాపిల్ గా జామకాయను ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా..?

Guava: జామకాయ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. జామకాయను పేదవాడి యాపిల్ గా కూడా అభివర్నిస్తారు. నిజానికి ఖరీదైన యాపిల్ పండులో ఉండే అన్ని రకాల పోషక విలువలు ఈ జామకాయలలో పుష్కలంగా ఉంటాయి. అందులోను జామకాయ కూడా విరివిగా దొరకడంతో పాటు చాలా చౌకగా కూడా అందరికి అందుబాటులో లభ్యం అవుతుంది. జామపండ్లు ఆరోగ్యానికి అనేక లాభాలను చేకూరుస్తాయి.ఈ జామకాయ ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే రుచికి రుచితో పాటు,ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

Guava Leaves: 2 రోజులు పరగడుపున జామ ఆకులు తింటే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Guava: జామకాయ యొక్క ఉపయో
గాలు :

ఈ జామపళ్ళలో విటమిన్ ‘సి’పుష్కలంగా వుంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్‌ ఎ,విటమిన్‌ బి,కాల్షియమ్‌,ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌,ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి చాలానే ఉన్నాయి.అలానే జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ కూడా జామకాయలో నిండుగా ఉన్నాయి. జామకాయలో క్యాలరీలు తక్కువగాను, పీచు పదార్ధం ఎక్కువగాను ఉంటుంది. నీటిలో కరిగే విటమిన్లు అయిన బి, సి విటమిన్లు, అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు అయిన ఏ విటమిన్ జామకాయలో అధికంగా ఉంటాయి.

Black Guava: నల్ల జామకాయ గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!
షుగర్ వ్యాధిగ్రస్థులకు సంజీవనిలా పనిచేసే జామకాయ:

అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులకు జామకాయ ఎంతో మంచిది. చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామకాయ మొదటిది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడే పండు. జామకాయ.అంతేకాకుండా బరువు తగ్గాలని భావించే వారు జామకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే’ పెక్టిన్’ జామ కాయలో లభిస్తుంది.

బరువు తగ్గడంలో జామకాయ పాత్ర ఎంతవుందంటే..?

ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అలాగే జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి.మీ దంతాల సంరక్షణలో జామ కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జమ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది.చిగుళ్ల వాపులు సైతం తగ్గించుకోవచ్చును.

దంతల రక్షణలో జామ :

ఈ జమ ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడడంతో పాటు ధృడత్వం కూడా తయారవుతాయి.దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకుంటే ఉపశమనం ఉంటుంది.జామకాయలో ఉండే మ్యాంగనీస్ ఎముకల దృడంగా అవ్వడానికి సహాయపడుతుంది అలాగే జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడేవారు ఐదు, ఆరు జమ ఆకులను నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ లాగా కాచి ఆ నీటిని తాగితే దగ్గు,జలుబు పోతుంది. అలాగే అందాన్ని కాపాడే విషయంలో కూడా జమకాయ బాగా ఉపయోగపడుతుంబది.మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా రాసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం,అందానికి అందం మీ సొంతం అవుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri