NewsOrbit
హెల్త్

నిమ్మపండు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం

నిమ్మపండు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం

కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.  జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి.

నిమ్మపండు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం

జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది.గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు.

నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది.కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా బ్రష్ చేస్తే దంతాలు మెరుస్తాయి.
గోరువెచ్చని నీటి లో నిమ్మ రసం కలిపి తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ రసంలో తేనె కలుపు కుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది. నోటి పూత కు నిమ్మ మంచి ఔషధం.

బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. రోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరవు.

జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.
కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో, కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
నిమ్మరసాన్ని ,తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri