బంగాళాదుంప అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఆలూ అంటే ఇష్టపడతారు. దుంపల్లో బంగాళాదుంపకు అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. బంగాళదుంపలతో ఎన్నో రకాల వెరైటీ వంటలు చేయవచ్చు.అలాగే ఆలులో పిండిపదార్ధాలు,కార్బోహైడ్రేట్లు,పీచు, కొవ్వు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.అంతేకాకుండా కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం, సోడియం, ఇనుము,విటమిన్ బి6, సి, రైబోఫ్లావిన్, ధయామిన్ వంటివి పోషకాలు కూడా పుష్కలంగా లభ్యమౌతాయి.బంగాళాదుంప తినడం వలన ఆడవాళ్ళ అందం కూడా రెట్టింపు అవుతుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బంగాళ దుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతు ఉంటారు. అలాంటి వారికి బంగాళ దుంప రసం బాగా సహాయపడుతుంది.బంగాళ దుంప నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని నలుపు భాగం ఉన్నచోట రాయటం వల్ల నల్లని వలయాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ముఖం మీద ఉన్న మచ్చలు,మొటిమలు కూడా తగ్గుతాయి.
చర్మంపై ముడతలు పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేయడంలో బంగాళాదుంప కీలక పాత్ర పోషిస్తుంది. చర్మంపై ఏర్పడిన మృతకణాలను తొలగించి చర్మాన్ని మరింత మెరిసేలాగా చేస్తుంది.నిజానికి బంగాళాదుంపల కన్నా దానిపైన ఉండే పొట్టులోనే ఎన్నో రకాలు అయిన పోషకాలు ఉంటాయి. ఈ పొట్టులో విటమిన్ ఎ శాతం అధికంగా ఉంటుంది.