బ్రౌన్ రైస్ అంటే ఏంటో అనుకునేరు అవి దంపుడు బియ్యం. వడ్లను బియ్యం గా తయారు చేసేటప్పుడు వాటి పొరను ఎక్కువ గా తొలగించ కుండా ఉంచాలి. వీటినే బ్రౌన్ రైస్ అంటారు.
బియ్యం మిద ఉండే అ పొర లో అనేక లాభాలు ఉన్నాయి. అ పోర ను తొలగించి తయారు చేసే బియ్యం అదేనండి వైట్ రైస్ లొ మనకు అవసరమైన పోషకాలు అన్ని పోతాయి. బ్రౌన్ రైస్ వైట్ రైస్ తొ పోల్చితే మంచి రుచి కలిగి ఉంటాయి. మరియు శరీరానికి అవసరం ఐన పోషకాలను అందిస్తాయి.బ్రౌన్ రైస్‌లో బోలడన్ని పోషకాలు ఉన్నాయి.
తక్కువ కేలరీలు.. ఎక్కువ ఫైబర్లు అందించే ఈ బ్రౌన్ రైస్‌లో ఇంకా మెగ్నీషియం, పాస్పరస్, థయామిన్, నియాసిన్, పాస్పరస్, విటమిన్ B6 వంటి ములాలు కూడా ఉన్నాయి. దంపుడు బియ్యం అన్నం రుచిగా కావలనంటే ఇలా చేయవలిసిందే . ముందుగా దంపుడు బియ్యం ఒక కప్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న బ్రౌన్ రైస్ లో ఎక్కువనీళ్ళు పోసి నానా పెట్టుకోవాలి.
ఒక కప్ బియ్యం కోసం కాబట్టి 1 లీటర్ కి ఇంకాకొంచెం ఎక్కువ నీళ్లు పోసి 20 గంటల పాటు నానబెట్టండి.మొట్టమొదటి సారి వండేటప్పుడు మాత్రమే ఇలాచేస్తే సరిపోతుంది.తర్వాత తర్వాత వండుకునే టప్పుడు 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది.20 గంటల పాటు నానిన బియ్యం లో నీళ్లు తీసి ఒక బాటిల్ లో కి తీసుకుని ఫ్రిజ్ లో భద్ర పరచండి.ఇప్పుడు బియ్యం లో మరికొద్దిగా నీళ్లుపోసి సి కడిగి సరిపడినన్నీ నీళ్లు పోసి అన్నం ఉడికించుకుంటే అన్నం తయారవుతుంది.
మళ్ళి మరుసటి రోజు బియ్యం నానబెట్టేటప్పుడు ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకున్న బియ్యం నీళ్లు మరికొన్ని నీళ్లు పోసిమళ్ళి బియ్యాన్ని నానా బెట్టుకోవాలి.బ్రౌన్ రైస్ రుచి బాగుండాలంటే ఈ పద్దతి ఎప్పుడు పాటిస్తూనే ఉండాలి . ఈ పద్దతిలోవండుకుని చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీసొంతమవుతుంది.