షుగర్ ఉన్నవాళ్లు ఆహారం లో వెంటనే ఇది తీసుకోవడం మొదలు పెట్టండి…

‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ లో ఎన్నో ఔషధ విలువలుఉన్నాయి. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఉసిరి అని అంటారు ఇది మన ఆయుర్వేద వైద్యంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోళ్ళవరకు  ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి.

షుగర్ ఉన్నవాళ్లు ఆహారం లో వెంటనే ఇది తీసుకోవడం మొదలు పెట్టండి...

డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది.  ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిఉన్నవారు ఉదయాన్నే ఒక మంచి ఉసిరి కాయ తినడం వలన షుగర్ అదుపులో ఉంటుంది. అయితే డయాబెటిస్ పట్ల ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుందని పలువురు సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనల్లోకూడా  తెలిసింది. ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని క్లోమగ్రంథిపై ప్రభావం చూపడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని సైంటిస్టులు తెలిపారు.

ఈ క్రమంలోనే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. ఉసిరిలో ఉండే క్రోమియం కార్బొహైడ్రేట్ల మెటబాలిజాన్ని సరిచేస్తుందట. దీంతోపాటు క్లోమ గ్రంథిలో విడుదలయ్యే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చూస్తుందంట. దానివల్ల బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయట.. ఫలితంగా షుగరు కూడా అదుపులో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

జర్నల్ ఆఫ్ మెడికల్ ఫుడ్‌లో సైంటిస్టులు ఉసిరికాయలు, మరియు డయాబెటిస్ అంశంపై జరిపిన  పరిశోధనను ప్రచురించడం జరిగింది. ఇక డయాబెటిస్ మాత్రమే కాకుండా ఉసిరికాయల వల్ల అధిక బరువు తగ్గించుకోవడం తో పాటు , శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు .అందుకే ప్రతి రోజు ఉసిరికాయ పొడి లేదా జ్యూస్‌ను తీసుకుంటే పై సమస్యల నుంచి చక్కని పరిష్కారం  పొందవచ్చని  నిపుణులు తెలిపారు.