అందం ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అంటే , ఆరోగ్యమే ముఖ్యమని చెప్తాం.ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటె అందం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి. ఎక్కువ నీరు త్రాగడం, కూరగాయలు , ఆకు కూరలు , పండ్లు, ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన అందం ఆరోగ్యం రెండు ఒకే సారి సొంతమవుతాయి.కేవలం చర్మానికి రాసుకునే క్రీం వలన అందం ఎప్పుడు రాదు, దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం.
అందానికి ఫేస్ ప్యాక్ ల కన్నా జ్యూస్‌లు మేలు!. యవ్వనంగా, గ్లోయింగ్ స్కిన్ తో కనబడాలంటే కొన్ని బెస్ట్ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉండే పండ్లు, కూరగాయల జ్యూసులు మన శరీరానికి అవసరం అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ని పుష్కలంగా అందిస్తాయి.కాంతివంతమైన చర్మం కోసం ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా ఉందంటే అది క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్లో విటమిన్ సి, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి వృద్ధాప్యం, ముడుతలతో సంబంధం ఉన్న ఫ్రీరాడికల్ చర్యను నిరోధిస్తుండగా, బీటా కెరోటిన్ చర్మ మంటను నివారిస్తుంది. అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్‌ని మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. వారానికి కనీసం అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు నడవడం ,లేదా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏరోబిక్ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి.
శరీరంలో తగినంత నీటిశాతం లేకపోతే చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, వంటి వాటికీ దారితీస్తుంది . అందుకే మన శరీరంలో దాదాపు 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ప్రతిరోజు మంచినీరు త్రాగడం వల్ల చర్మం మరియు చర్మ రంద్రాల ను క్లీన్ చేసి కొమలమైన సౌందర్యాని అందిస్తుంది. మరియు చర్మాని మృదువుగా,తేమగా ఉంచుతుంది. సరైన మోతాదులో మంచినీరు తాగడం వలన జీర్ణ ప్రక్రియ సక్రమముగ జరిగి మలబద్దకన్ని మరియు ఫైల్స్నినివారిస్తుంది. చూసారా అందాన్ని ఆరోగ్యాన్ని పొందే ఆహారం మనకి అందుబాటులోనే ఉంది. కేవలం క్రీం ల వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.