25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
హెల్త్

మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇవి తింటే సరి..!

Share

అందంగా కనిపించాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి. కాంతివంతమైన చర్మం కోసం ఎటువంటి ప్రయత్నం చేయడానికి అయినా వెనకాడారు. అయితే మారుతున్న కాలంతో పాటుగా మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.తినే తిండి విషయంలో,వాతావరణం కలుషితం అవుతుండటంతో మన ముఖం కూడ పాడవుతోంది.చిన్న వయసులోనే మొటిమలు, మచ్చలు రావడం, చర్మం పొడిబారిపోవడం వంటి ఎన్నో చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్​లు రాసుకుని ఉన్నా అందాన్ని చెడగొట్టుకుంటున్నారు.ముఖానికి మేకప్ వేసుకోవడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది.. ఒక్కోసారి మేకప్ వేసుకోకపోతే వాళ్ళను గుర్తుపట్టాడడం కూడా కష్టంగా మారిపోయిందనే చెప్పాలి. నిజానికి ముఖానికి అవి ఇవి రాసే బాబులిగా ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మనలో అందం కనిపిస్తుంది.మనం నిత్యం తీసుకునే మంచి ఆహారం మన చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతుంది.మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బాదం:

బాదం ఆటోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మానికి కూడా అంతే మంచి చేస్తుంది.ఇక బాదంలో విటమిన్ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇంకా అలాగే బాదం తింటే రక్తహీనత సమస్య కూడా త్వరగా తగ్గుతుంది.ఎందుకంటే వాటిలో కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే విటమిన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మచ్చలను కూడా చాలా సలువుగా తగ్గిస్తాయి.

చియా గింజలు :

చియా గింజలల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ చియా గింజలు చర్మం ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఉండేలా చూసుకుంటాయి..ఈ గింజల్లో ఖనిజాలు ఇంకా విటమిన్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి.

పండ్లు:

ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే పండ్లు తింటూ ఉండాలి. ముఖ్యంగా స్ట్రాబెరీలు, బ్లూబెర్రీలు తీసుకోవడం చర్మానికి చాలా మంచిది అనే చెప్పాలి.. అలాగే ఆహారంలో చేపలను భాగంగా చేసుకుంటే ఇవి చర్మానికి చాలా మేలుని చేస్తాయి. ఇక ఇందులో ఉండే ఒమేగా 3 ఇంకా అలాగే పోషకాలు అనేవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి..




Share

Related posts

Negative energy ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి !!

Kumar

KCR: కేసీఆర్ టీంలో క‌రోనా క‌ల‌క‌లం … ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా

sridhar

చేదుగా ఉన్నా వీటిని తప్పకుండా తినాలిసిందే..!!

Ram