Menstrual: మీ నెలసరిలో రక్తస్రావం ఏ రంగులో ఉంటుంది అనేది మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామందికి దీని గురించి అవగాహన ఉండదు. ఎందుకంటే రుతు స్రావం అంటే రక్తం అది ఎరుపు రంగులో ఉంటుంది అని మాత్రమే అనుకుంటారు.
కానీ కొన్నిసార్లు ఈ స్రావం బ్రౌన్, ఆరెంజ్,పింక్, వంటి రంగుల్లో కూడా ఉంటుంది అని మీకు తెలుసా?ఈ రంగులు మన శరీరంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు గురించి తెలియచేస్తుంది.కాబట్టి మీ పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఏ రంగులో ఉంటుందో గమనించండి అని తెలియచేస్తున్నారు గైనకాలజిస్టులు. మరి, బ్లీడింగ్ ఏ రంగులో ఉంటే ఏ వ్యాధికి గుర్తు ఆ వివరాలు తెలుసుకుందాం
మీ బ్లీడింగ్ ఎరుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మీ గర్భాశయం, అండాశయం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మీరు బిడ్డకు జన్మనివ్వడానికి ఎలాంటి సమస్య లేనట్టే. ఈ తరహా రక్తస్రావం ఉంది అంటే గర్భాశయం లో రక్తం నిలవ ఉండకుండా అప్పటికి అప్పుడు బయటకు వచ్చిన రక్తం కావడం వల్ల… రక్తస్రావం కాస్త ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది.
ఒకవేళ మీ బ్లీడింగ్ నారింజ రంగులో ఉంది అంటే గర్భాశయం లో రక్తం అందులో ఉండే ఇతర స్రావాలతో పాటు కలిసి బయటకు వస్తుంది అని అర్ధం. ఇలా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది అని మరువకండి. దీనితో పాటు బ్లీడింగ్ వాసన వస్తుంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవాలి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండటం వలన అది రక్తంతో కలిసి ఇలాంటి రంగులో రక్తస్రావం జరుగుతున్నట్టు అర్థం. కాబట్టి ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేయించుకోవడం మంచిది.
ఒకవేళ మీ బ్లీడింగ్ బ్రౌన్ రంగులో ఉంటే మీ గర్భాశయం లో రక్తం నిల్వ ఉండి ఆ సమయం లో బయటకు వస్తుంది అని అర్థం. ఇలాంటి రక్తస్రావాన్ని ఎక్కువగా ఉదయం పూట గమనిస్తూ ఉంటాము. మీ స్రావం బ్రౌన్ రంగు లో ఉంటే ప్రమాద సూచిక గా తెలుసుకోవాలి. నెలసరి సమయంలో బాగా నొప్పి గా ఉండి… రక్తం గడ్డలుగా రావడం జరుగుతుంటే మాత్రం మీ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని గమనించండి. వీటితో పాటు ఏదైనా వాసన వస్తుంది అంటే మాత్రం ఏదో పెద్ద సమస్యే ఉందని గ్రహించి వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.