ట్రెండింగ్ హెల్త్

Panipuri: మిక్స్డ్ ఫ్రూట్ పానీపూరీ టెస్ట్ చేశారా.. ఇలా చేసుకుని తింటే అస్సలు వదలరు..!

Share

Panipuri: పానీపూరి.. ఈ పేరు చెప్పగానే కొందరికి నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. వాటిని చూడగానే నోట్లో వేసుకొని గట్టుక్కుమనాల్సిందే..! పానీపూరి కూడా పలు రకాలు ఉన్నాయి వాటిలో మిక్స్ ఫ్రూట్ పానీపూరి కూడా ఒకటి.. పానీపూరి ప్రియులు వీటి కోసం రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే.. అలాకాకుండా అదే టేస్ట్ తో మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..!

Mixed Fruit Panipuri: Preparation
Mixed Fruit Panipuri: Preparation

మిక్స్ ఫ్రూట్ పానీపూరి తయారీ విధానం..

మిక్స్ ఫ్రూట్ పానీపూరి కోసం కావలసిన పదార్థాలు.. పైనాపిల్ ముక్కలు అర కప్పు, అరటి పండు ముక్కలు అర కప్పు, ఆపిల్ ముక్కలు అరకప్పు, ఆరెంజ్ ముక్కలు అర కప్పు, తాజా క్రీమ్ 2 కప్పులు, తేనె 5 టేబుల్ స్పూన్లు, పానీపూరి 25 అవసరం.

Mixed Fruit Panipuri: Preparation
Mixed Fruit Panipuri: Preparation

ముందుగా అన్ని రకాల పండ్ల ముక్కలను చాలా సన్నగా తరగాలి. ఈ పండ్ల ముక్కల పైన తేనె వేసి బాగా కలిపి అర గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ పూరి మధ్యలో రంధ్రం చేసి అందులో పట్టినన్ని తాజాపండ్ల ముక్కలు వేయాలి. దానిపైన ఫ్రెష్ క్రీమ్ వేసి కూల్ గా సర్వ చేసుకోవాలి. అంతే మిక్స్ ఫ్రూట్ పానీపూరి తినడానికి రెడీ. సాధారణ పానీపూరి తో పోలిస్తే ఈ మిక్స్ ఫ్రూట్ పానీపూరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మీకు నచ్చిన పండ్లని యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు.


Share

Related posts

Entrance Test : నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్

bharani jella

Viral Video: పోలీసులను చూసి పోసుకున్నాడు..! హల్చల్ చేస్తున్న వీడియో..!!

bharani jella

Weight Loss: బరువు తగ్గడానికి జపనీస్ అధ్బుతమైన టెక్నిక్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar