NewsOrbit
హెల్త్

ములక్కాడ తింటే .. మీకుపండగ లాంటి విషయం తెలుస్తుంది !

ములక్కాడ తింటే .. మీకుపండగ లాంటి విషయం తెలుస్తుంది !

మునగ చెట్టు కి  ఉన్న ఔషధ గుణాలు చాల అద్భుతమైనవి . ఆ చెట్టులో ప్రతిభాగం ఎంతో ఉపయోగం .  మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ గా ఉంటుంది.

ములక్కాడ తింటే .. మీకుపండగ లాంటి విషయం తెలుస్తుంది !

‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాల తో పాటు  మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు .  100 గ్రా. ఎండిన ఆకుల్లో… అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం,పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, పాలకూరలో కన్నా 25 రెట్లు ఐరన్‌…క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, ఇలా చాలా లభిస్తాయి.

ఇది 300 వ్యాధుల్ని నివారించగల శక్తి కలిగింది.ఇందులో ఉన్న ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ నశించిపోతాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కూడా దరిదాపుల్లో ఉండవు . ఆల్జీమర్స్‌ మాయమవుతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దీనికి భయ పడలిసేందే. గాయాలు అయినప్పుడు  మునగాకు పేస్టు రాయడం వలన మచ్చుకకి కూడా కనిపించవు.

రక్తహీనతతో బాధ పడేవారికి  కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను మునగాకు పొడినో రోజూ వేడి వేడి గా ఉన్న అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి జరుగుతుంది . . బాలింతలకు మునగాకు పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలంగా పడతాయి.కంటి కి  సంబందించిన జబ్బులు చాలానే ఉన్నాయి .వాటిల్లో  రేచీకటి బాధితులూ ఎక్కువే ఉన్నారు . కంటికి సంబందించిన వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

ఇంటాబయటా అంతటా దుమ్ము ,ధూళి, కాలుష్యమయమే . ఇలాంటి వాతావరణం లో ఉండే మనకి  ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ అతి తేలికగా దాడి చేస్తాయి .  అందుకే మునగ ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తాగితే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధుల కి  దూరంగా ఉండవచ్చు. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి పూర్తిగా తగ్గిపోయి  చర్మం కాంతివంతం గా ఉంటుంది.

ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే పోషకాలు  ఎక్కువే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచడానికి ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ కూడా తగ్గిస్తాయి. పిత్తాశయం అద్భుతం గా  పనిచేస్తుంది. వీటిల్లోఉండే  జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గేలా చేస్తుంది.  వీర్యం చిక్కబడడం లో తోడ్పడుతుంది.

నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ జీర్ణమయ్యేలా చేయగలవు. రోగనిరోధకశక్తి ఎక్కువ గా ఉండడం వలన శ్వాససంబంధ సమస్యలు తక్కువ గా ఉంటాయి . వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ ఉండడం వలన  పోషకాహార లోపమూ రాదు. నాడీవ్యవస్థాచురుగ్గా  పనిచేస్తుంది.

థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే సహజ ఔషధం  మునగాకు.కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటి పిల్లలకి మునగాకును పెసరపప్పుతో కలిపి కూర వండి పెడితే అద్భుతం గా పనిచేస్తుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri