నాలుకను చూడటం ద్వారా ఆరోగ్యం గురించి ప్రాథమికంగా ఓ అంచనాకు రావచ్చు. అందుకే డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా నాలుక చూపించమంటారు.
మనం పరీక్షించి చూసినట్లయితే ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో ,తేమగా, మృదువుగా ఉంటుంది. ఒకవేళ నాలుక గాని పాలిపోయి తెల్లగా ఉంటె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటమే కాకుండా, ఐరన్, ప్రొటీన్ల లోపానికి కూడా ఇది సంకేతం గా గుర్తించాలి. నాలుక ఇలా కనిపిస్తే పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది .
నాలుక ఊదా రంగులో ఉంటే రక్త ప్రసరణ లోపాలు ,శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగాన్నాయని అర్ధం. దీనికి తగిన మందు ఏదైనా ఉంది అంటే అది వ్యాయామం చేయడమే. నాలుక ఎర్ర రంగులో ఉంటే, విటమిన్ B-12, ఫోలిక్ యాసిడ్ లోపం ఉందని భావించాలి. అతిగా యాంటీ బయాటిక్స్ తీసుకొనే వారి నాలుక నలుపు రంగులోకి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ధూమపానం, అతిగా టీ, కాఫీలు తాగడం.. నోటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూడం వల్ల కూడా నాలుక నల్లగా మారుతుంది.కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, చూయింగ్ గమ్ నమలడం వంటి అలవాట్ల వల్ల నాలుకపై బ్యాక్టీరియా పెరిగి కూడా నాలుక రంగు మారుతుంది. నాలుక మీద, నోట్లో పుండ్లు ఏర్పడినట్లయితే రోగ నిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి. పాల ఉత్పత్తులు, నిమ్మరసం తీసుకోవడం వల్ల అల్సర్లు దరిచేరకుండా ఉంటాయి.
అల్సర్లు దీర్ఘకాలికంగా ఉండటం క్యాన్సర్కు సంకేతంగా భావించాలి . ఉదయం బ్రష్ చేసిన తర్వాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే నోట్లో బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసన తో పాటు అనారోగ్యానికి గురవుతారు. నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటే అశ్రద్ద చేయకుండా తప్పకుండాడాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది .