NewsOrbit
హెల్త్

ఒక్కసారిగా నడుం పట్టేస్తోంది అనుకునేవారు పాటించాల్సిన బెస్ట్ ఐడియా !

ఒక్కసారిగా నడుం పట్టేస్తోంది అనుకునేవారు పాటించాల్సిన బెస్ట్ ఐడియా !

వెన్నునొప్పిసమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం ద్వారా దీర్ఘకాల సమస్యగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. దాంతో, సర్జరీల వైపు కూడా వెళ్లనవసరం ఉండదు. కోర్ స్ట్రెంతెనింగ్ వ్యాయామాలు, ఫిజికల్ థెరపీల కాంబినేషన్ లో వెన్నునొప్పి నుంచి ఉపశనం పొందవచ్చు.

ఒక్కసారిగా నడుం పట్టేస్తోంది అనుకునేవారు పాటించాల్సిన బెస్ట్ ఐడియా !

లో బ్యాక్ పెయిన్ తో గత కొంతకాలం నుంచే ఇబ్బంది పడుతున్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వలన వారిలో వెన్నునొప్పి సమస్య మరింత పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.  అందుకే బెడ్ రెస్ట్ ను మూడురోజులకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంతగా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని వారంటున్నారు.వెన్నునొప్పికి సరైన మందు వ్యాయామమని గుర్తించాలి. నడక వంటి చిన్నపాటి వ్యాయామాలు వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. ఐతే, మీ పరిస్థితిని బట్టి ఈ వ్యాయమాలుండాలి.

పరిమితంగానే వ్యాయామం చేయాలి.సింక్ దగ్గర సరైన పోజిషన్ లో నుంచోకపోవడంతో వెన్నుపై యాభైశాతం ఎక్కువ ఒత్తిడి పడటం జరుగుతుంది . సరైన పోశ్చర్ తో వెన్నుపై పడే ఒత్తిడిని తగ్గించడం సాధ్యం.సమస్యను తగ్గించాలంటే ముందుగా మీరు స్పెషలిస్ట్ ను సంప్రదించాలి. వారు మీ సమస్య తీవ్రతను అంచనా వేసి మీకు తగిన సూచనలు అందించి సమస్యను పరిష్కరించడంలో తోడ్పడతారు.అబ్డోమినల్ కండరాలను పటిష్టపరచడం ద్వారా చాలా మంది వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనంపొందగలుగుతున్నారు.ఫ్లెక్సిబిలిటీను పెంపొందించడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలపై అంటే తల నుంచి పాదాల దాకా సమాన బరువు పడుతుంది. దాంతో, ఒకే భాగంపై ఒత్తిడి పడటం తగ్గుతుంది.బరువైనవి ఎత్తేటప్పుడు అలాగే అధిక ఒత్తిడిని కలిగించేటటువంటి యాక్టివిటీస్ కి మాత్రమే బ్రేసెస్ ను పరిమితం చేయాలి. వీటిని పదిహేను నిమిషాలకు మించి వాడకూడదు.హీటింగ్ పాడ్స్ అలాగే కోల్డ్ ప్యాక్స్ వంటివి ఇటువంటి సమయంలో కచ్చితంగా సౌకర్యాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఐస్ , హీట్ లలో ఏది ఎక్కువ ఉపయోగకరమో చెప్పడం మాత్రం కష్టమే. చర్మాన్ని సంరక్షించుకుంటూ, వీటిలో ఏ పద్దతి సూట్ ఐతే ఆ పద్దతిని పాటించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రించేటప్పుడు మీ పొజిషన్ కూడా సరైన విధంగా ఉండాలి. మీ పొజిషన్ సరైన విధంగా లేనప్పుడు అలాగే మీరు నిద్రించే పరుపు వెన్నునొప్పికి కారకమైనప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుందని గమనించాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం .
వెల్లకిలా నిద్రించేవారు మోకాళ్ళకింద తలగడను పెట్టుకోవాలి. పక్కకు తిరిగి నిద్రించేవారు మోకాళ్ళ మధ్యలో తలగడను పెట్టుకోవడం ద్వారా వెన్నును న్యూట్రల్ పొజిషన్ లో ఉంచగలుగుతారు. బోర్లాతిరిగి పడుకునేవారు మెడపై అలాగే వెన్నుపై ఒత్తిడిపడుతుందని గ్రహించాలి.

స్మోకింగ్ వలన ఊపిరితిత్తులు పాడవుతాయన్న విషయం తెలిసినదే. ఐతే, స్మోకింగ్ అనేది వెన్నుసమస్యలను కూడా తీసుకువస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి, స్మోకింగ్ కు దూరంగా ఉండటం వలన కూడా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.డిప్రెషన్ అలాగే ఆందోళన వంటి సమస్యలున్నవారిలో వెన్నునొప్పి సమస్య కూడా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి, ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి.అనేక అధ్యయనాలు వెల్లడించిన విషయం ఏంటంటే, ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటివి మనసును ప్రశాంతపరుస్తాయి. వెన్నునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వెన్ను నొప్పి బాధనుండి బయట పడవచ్చు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri