కరోనా వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా ఒకవేళా తమ భాగస్వామి కి వైరస్ వచినట్టయితే ఎన్ని రోజుల తర్వాత శృంగారం చేయవచ్చు… అనే అనుమానం చాలా మందిలో ఉంది.
దీనిపై పలు సంస్థలు అనేక పరిశోధనలు కూడా చేశాయి. అయితే.. వారి పరిశోధనల్లో కొందరు శృంగారం వల్ల కరోనా రాదని తేల్చినా.. మరి కొందరు మాత్రం పురుషుల వీర్యంలో కరోనా వైరస్ ని కనుగొన్నామని చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కనీసం 30 రోజలు వరకు శృంగారంలో పాల్గొనవద్దని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు శరీరంలో కరోనా వైరస్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని.. తద్వారా తమ భాగస్వామికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
థాయిలాండ్ లో దాదాపు 38మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల వీర్యంపై ఈ మేరకు పరిశోధనలు చేశారు. వారిలో 16శాతం మంది వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. కోలుకొని దాదాపు నెల రోజులు గడిచిన వారిలో మాత్రం వైరస్ అవశేషాలు కూడా కనపడలేదని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. కనీసం ఒక నెల దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
నెల రోజులు ఆగిన తర్వాత కూడా కండోమ్ వాడకం మంచిదని చెబుతున్నారు. మీ భాగస్వామికి కరోనా లక్షణాలు కనపడితే.. మీరు కూడా ముందస్తు జాగ్రత్తలో ఉండటం మంచిది. వారితో సన్నిహితంగా మెలగడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల మీకు కూడా కరోనా వచ్చే అకవాశం ఉంది. ముద్దులకైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.