మన సమాజం లో శృంగారం పట్ల ఉన్న నిబంధనలు వలన శృంగారం గురించి మాట్లాడటానికి వెనుకాడతారు. అలా అని వారికి దానిపై ఆసక్తి లేదాఅంటే అది కాదు. ఎవరు అవునన్నా కాదన్న… శృంగారం గురించి ఆసక్తి అందరికీ ఉంటుంది.ఇది ఒప్పుకోవాలిసిన నిజం.. ఏదో తెలియని భయం కొందరిది అయితే అపోహలు తో ఇంకొంతమంది ఉంటారు.
చాల మందికి తెలియని విషయాలను నిపుణులు వివరించారు.ఒవల్యూషన్ రోజు అంటే అండం విడుదలైయే రోజు మహిళలు శృంగారంలో పాల్గొంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఆ రోజు వాళ్లకు ఆ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి.పెద్దవయ్యస్సు వచ్చిన స్త్రీలలో శృంగారంపై ఆసక్తి ఏముంటుందిలే అని అందరూ అనుకుంటారు. కానీ 80 ఏళ్లు దాటిన 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటారట.
సాధారణంగా శృంగారం చేసే సమయంలో మగవాళ్లకు 200 క్యాలరీలు కరిగితే మహిళల్లో 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి. హస్తప్రయోగం వలన డిప్రెషన్ లక్షణాలను తగ్గుతాయట. అంతేకాకుండా శృంగారం బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుందట. అలాగే కొన్ని హార్మోన్లు విడుదలవడం వల్ల కాస్త అనుకూలంగా అనిపిస్తుంది.మైగ్రేయిన్స్తో బాధపడే స్రీలు శృంగారంలో ఎక్కువ సమయం పాల్గొనడానికి ఆశక్తి చూపుతారు.శృంగారం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనంఉంటుందంట.
కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్లు శృంగారం బాగా అనుభవిస్తారట. మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ లిబిడోని సూచిస్తాయి.ఎప్పుడైనా మీ భర్తటెస్టోస్టెరాన్ లెవెల్స్ తెలుసుకోవాలి అని అనిపిస్తే, ఉంగరపు వేలు, చూపుడు వేలు సైజ్‌లను పోల్చి తెలుసుకోవచ్చు. ఉంగరపు వేలు పొడవుగా ఉంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం.