30.2 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
ట్రెండింగ్ ప్ర‌పంచం

పాట పాడితే చాలు.. అక్కడ ప్రయాణం ఉచితం!

Share

సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే అందుకు సరిపడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మనం మన గమ్యాన్ని చేరుకోగలం. కానీ మీరు ఉచితంగా ప్రయాణం చేయాలని భావిస్తే మీకు పాటలు పాడడం వస్తే చాలు… మీ గమ్య స్థానానికి ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా చేరుకోవచ్చు. మనం ఎలాంటి పాటలు పాడిన సరే అక్కడ మాత్రం డబ్బులు తీసుకోకుండా మన గమ్యస్థానానికి చేరుస్తారు. ఇంతకీ ఇంత మంచి అవకాశం ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? తైవాన్ కి చెందిన ఓ టాక్సీ డ్రైవర్ ఈ అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నాడు. ఇంతకీ ఎందుకు అతను ఉచితంగా ప్రయాణికులను వారి గమ్యానికి చేరవేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

మామూలుగా తైవాన్ ప్రజలకు పాటలు అంటే ఎంతో ఇష్టం. అందుకోసమే తైవాన్ ‘కరోకే’ ట్యాక్సీలు (కచేరీ ట్యాక్సీలు) ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక్కడ టాక్సీ డ్రైవర్ల లో ఒకరైన లియాంగ్ అనే వ్యక్తి మాత్రం ఎంతో భిన్నంగా ఉంటాడు. తనకు పాటలంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల అతడి టాక్సీలో ఎక్కే ప్రయాణికులను ఒక పాట పాడమని అడుగుతాడు. ఆ విధంగా తన ప్రయాణికులచే పాటలు పాడించి వారి గమ్యస్థానాలకు ఉచితంగా చేర వేస్తుంటాడు. సదరు ప్రయాణికులు పాటలు పాడటం రాదని చెప్పిన వారిని ఎంతో బలవంతంగా ప్రోత్సహించి వారిచే పాటలు పాడిస్తుంటాడు.

లియాంగ్ తన టాక్సీ లో ప్రయాణించే ప్రయాణికులకు మొదటగా తాను పాట పాడటం, లేదా ఒక మ్యూజిక్ ని ప్లే చేసి ఇది ఏ పాట కనుక్కోమని చెబుతాడు. ఆవిధంగా ప్రయాణికులు సరైన సమాధానం చెబితే వారికి ఉచితంగా వారి గమ్యానికి చేర వేస్తుంటాడు. అంతేకాకుండా తన టాక్సీ లో ఒక కెమెరాని పెట్టి ప్రయాణికులు పాడిన పాటలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం వల్ల వాటికి వ్యూస్ రావడం మొదలయ్యాయి. ఈ విధంగా ఇప్పటివరకు అతనికి 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. లియాంగ్ పాడిన పాటలకు మాత్రం కొన్ని లక్షలో వ్యూస్ వచ్చేవి. ఇప్పటి వరకు ఇతను 10 వేలకు పైగా వీడియోలను రికార్డు చేశాడు. ఈ విధంగా పాటలు పాడటం ద్వారా ప్రయాణికులకు ఉచిత సౌకర్యాన్ని కల్పించడంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న లియాంగ్ పలు టీవీ కార్యక్రమాలలో కూడా కనిపించి సెలబ్రిటీగా మారిపోయాడు.


Share

Related posts

Moringa Roots: మునగ వేర్లు తో ఈ అనారోగ్య సమస్యలు దూరం..!!

bharani jella

Osteoarthritis: ఆస్టియో ఆర్థరైటిస్ దేని వలన వస్తుంది..!? లక్షణాలు..!! జాగ్రత్తలు..!!

bharani jella

బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ జైలుకి… విజయం సాధించిన రోబో టీం?

arun kanna