NewsOrbit
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

 BJP vs Mamatha: జగన్ బాటలోనే మమత.. కానీ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టే ఉంది..!!

BJP vs Mamatha: బెంగాల్‌లో ఎన్నికలు పూర్తి అయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ కొనసాగుతున్నట్లు కనబడుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఫలితం కనబడలేదు. దీదీ పోటీ చేసిన నందిగ్రామ్ లో అయితే ఓడించారు కానీ రాష్ట్రంలో టీఎంసీ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. అయితే మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ పరిపాలనలో ఇరుకున పెట్టే చర్యలను కేంద్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల నారద టేపుల కేసుకు సంబంధించి టీఎంసీ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. ఆ సమయంలో మమతా బెనర్జీ వారి కోసం సీబీఐ ఆఫీసు వద్దకు వెళ్లి మరీ ఆందోళన చేశారు.

 BJP vs Mamatha west Bengal cs controversy issue
BJP vs Mamatha west Bengal cs controversy issue

ఇప్పుడు తాజా సీఎస్ వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం మధ్య పేచీ మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బంధోపాధ్యాయ్‌ని రీకాల్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై దీదీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో సీఎస్‌ను కేంద్రానికి పంపడం కుదరదు అనే తేల్చి చెప్పేసింది. సీఎస్ డిప్యూటేషన్ కు సంబంధించి ప్రదాన మంత్రి మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. సీఎస్ ను రిలీవ్ చేయలేమని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి రిపోర్టు చేయాలని కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మోడీని మమత కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలే కొనసాగుతాయని భావించాలని సూచించారు.

Read More: Supreme Court: ఏబీఎన్, టీవీ5 లకు షాక్.. వైసిపీకి కూడా..! తీర్పులో ఏముందంటే..!

ప్రస్తుత సీఎస్ బంధోపాధ్యాయ్ కు ఈ నెల 31 (నేటి)తో 60 ఏళ్లు నిండుతాయి. ఇదే రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని సీఎం మమతా బెనర్జీ ఈ నెల 17 కేంద్రాన్ని అభ్యర్థించారు. కోవిడ్ పోరులో ఆయన సేవలు అవసరమని పేర్కొన్నారు. దీనిపై తొలుత సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ నెల 25న ఆయన పదవి కొనసాగింపునకు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలు జారీ చేసిన మూడు రోజులు కాకముందే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సీఎస్ బంధోపాధ్యాయ్ ను తక్షణం రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీదీ లేఖపై పీఎం మోడీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదే తరహా వ్యవహారం గతంలో ఏపిలో చోటుచేసుకుంది. గతంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. అప్పుడు కేంద్రంలోని బీజేపీ అంగీకరించింది. ఆ తరువాత కూడా మరో మూడు నెలల పొడిగింపునకు లేఖ రాస్తే అప్పుడు కూడా కేంద్రం అంగీకరించింది. సీఎం జగన్ లేఖల కారణంగా జూన్ నెలలో పదవీ విరమణ చేయాల్సిన నీలం సాహ్ని డిసెంబర్ వరకూ ఏపి సీఎస్ గా కొనసాగారు. కానీ పశ్చిమ బెంగాల్ వరకు వచ్చే సరికి ఆ పరిస్థితులు లేవు. బీజేపీ అందుకు అంగీకరించే అవకాశాలు కనబడటం లేదు.

 

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju