NewsOrbit
జాతీయం న్యూస్

Cyclone Alert: తుఫానుగా మారిన అల్పపీడనం .. ‘హమూన్’ గా నామకరణం

Cyclone Alert:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫాను గా మారింది. ఈ తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలో మీటర్ల, పశ్చిమ బెంగాల్ లోని దిగాకు 360 కిలో మీటర్ల దూరంలో, బంగ్లాదేశ్ లోని హెపుపురాకు 510 కిలో మీటర్లదూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

రేపు బంగ్లాదేశ్ లోని హెపుపురా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. హమూన్ తుఫాను కారణంగా భారత తీర ప్రాంతంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఒడిశాలో ఒ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు.

ఐఎండీ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒడిశా పై నేరుగా ప్రభావం మాత్రం ఉండదు కానీ జాలర్లు ఎవరూ బుధవారం వరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఉరుములతో కూడిన ఓ మాస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.

Roja Ambati: జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంపై మంత్రులు రోజా, అంబటి విమర్శలు ఇలా..

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N