NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Roja Ambati: జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంపై మంత్రులు రోజా, అంబటి విమర్శలు ఇలా..

Roja Ambati: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంపై మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులు స్పందిస్తూ ఘాటు విమర్శలు చేస్తూ సెటైర్లు వేశారు. పాడుతా తీయగా సెలక్షన్ కమిటీ కూర్చని చర్చించిన తీరులో జనసేన, టీడీపీ సమావేశం ఉందని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

అటు ఆరుగురు, ఇటు ఆరుగురు కూర్చుని చర్చించారని, ఏ విషయంలో చర్చించినా ప్రయోజం ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. అటు అర సున్నా, ఇటు అర సున్నా కూర్చుని జైలులో ఉన్న గుండు సున్నా కోసం చర్చించారని అర్కే రోజా సెటైర్ వేశారు. చంద్రబాబు జైలు నుండి బయటకు రావడం కష్టమని అన్నారు. నిజం తెలిస్తే భువనేశ్వరి కూడా జైలు కెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నారా భువనేశ్వరి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారని రోజా విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు కోసమే పని చేశాడని, ప్యాకేజీ స్టార్ అని పవన్ మరో సారి నిరూపించుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సున్నా సున్నా కలిస్తే ఫలితం సున్నాయేనన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ల సమావేశంతో ఏమి లాభమని అన్నారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్లాననీ, బలహీనపడ్డ టీడీపీని బలోపేతం కోసం కలిశానని పవన్ చెబుతున్నారనీ, కానీ ప్రజలు ఈ కలయికను హర్షించడం లేదని అన్నారు. లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందనీ, బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమీ కాదని తాము ఎప్పటి నుండో వీళ్లు కలిసే వస్తారని చెబుతూనే ఉన్నామన్నారు. తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతోందన్నారు. ముద్రగడ పద్మనాభంను హింసించినప్పుడు, అరెస్టు చేసినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని అంబటి ప్రశ్నించారు. లోకేష్ అమిత్ షాను కలవడానికి పదే పదే ప్రాధేయపడ్డారని, కానీ నిన్నటి వరకూ లోకేష్ ఎన్ని అబద్దాలు చెప్పాడన్నారు. కిషన్ రెడ్డి ప్రకటనతో లోకేష్ చెప్పినవన్నీ తప్పులని తేలిపోయిందన్నారు. పురందేశ్వరి తప్పుడు విధానాలు కూడా ఇప్పుడు తేలతెల్లం అయ్యాయన్నారు.

తెలుగు రాష్ట్రాలకు తెగులు తెలుగుదేశం పార్టీయేనని, ఇప్పుడు ఆ తెగులు పవన్ కళ్యాణ్ కి కూడా పట్టుకుందన్నారు. అక్రమంగా 45 రోజులు జైలులో పెట్టడం సాధ్యమనా అని ప్రశ్నించారు. ఏ వ్యవస్థని అయినా మేనేజ్ చేసేది చంద్రబాబుయే కదా ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసే కదా చంద్రబాబు తప్పించుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వల్ల అది సాధ్యం కాదని అన్నారు. రాజమండ్రి టీడీపీ, జనసేన సమావేశంతో జరిగేది ఏమీ లేదన్నారు అంబటి రాంబాబు.

TDP Janasena: ముగిసిన జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ .. తీసుకున్న నిర్ణయాలు ఇవీ

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju