NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సిద్ద రామయ్య వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ .. కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ద రామయ్య లు సీఎం రేసులో ఉండటంతో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. నిన్నటి సమావేశంలో సీఎం అభ్యర్ధి ఎంపిక అధిష్టానం నిర్ణయానికి వదిలివేస్తూ తీర్మానించారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారికే సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో సీఎల్పీ సమావేశం నిర్వహించి 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల బృందం నివేదికను సిద్దం చేసింది.

dk shivakumar siddaramaiah

 

ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో ఖర్గేకి పరిశీలకుల బృందం నివేదిక అందించనున్నది. అనంతరం పార్టీ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రకటించనున్నది. ఈ నెల 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్ధిని ఎప్పుడు ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా వార్తలు రాగా, ఆయన తనకు అధిష్టానం నుండి ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. సిద్దా రామయ్య ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

అయితే అభిప్రాయ సేకరణలో మెజార్టీ ఎమ్మెల్యే లు సిద్ద రామయ్యకే మొగ్గు చూపినట్లుగా సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ఓటింగ్ లో సిద్ద రామయ్య ముందుండగా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనుకబడ్డట్లు సమాచారం. దీంతో కాబోయే సీఎం సిద్దరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?