Yoga: యోగా గురించి కెలికాడు…ఈ నేపాలీ పెద్దాయ‌న బుద్ధి పోనిచ్చుకోలేదు

Share

Yoga: ప్ర‌పంచవ్యాప్తంగా యోగా కు భార‌త‌దేశం గుర్తింపు తెచ్చింద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, వివాదాలంటే మ‌క్కువ చూపించే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.. తన నివాసం బలూవతార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఓలీ మాట్లాడుతూ యోగా పుట్టుకపై యోగా పుట్టింది నేపాల్ లోనేనని, భారత్‌లో కాదని ఆయన ప్ర‌క‌టించేశారు. త‌ద్వారా కొత్త వివాదానికి తెర లేపారు.

Read More: PM Modi: యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి…! ప్రధాని నరేంద్ర మోడీ..!!

మ‌నోడు మంచి వివాద ప్రియుడు…
కేపీ ఓలికి వివాదాలు అంటే మ‌క్కువ అన్న పేరుంది. నకిలీ అయోధ్య ను సృష్టించడం ద్వారా సాంస్కృతిక ఆక్రమణకు భారతదేశం కారణమవుతుందని ఆయన ఆరోపించారు.రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లో ఉందని.. రాముడు నేపాలీ అని ఓలి గత ఏడాది జూలైలో వ్యాఖ్యానించారు. ‘నిజమైన అయోధ్య బిర్గుంజ్‌కు పశ్చిమాన ఉన్న థోరి అనే నగరంలో ఉంది. రాముడు అక్కడే జన్మించాడని భారతదేశం పేర్కొంది. వాస్తవానికి అయోధ్య బిర్గుంజ్‌కు పశ్చిమాన ఉన్న ఒక గ్రామం’అని ఓలి ప్ర‌క‌టించాడు. ఇప్పుడు తాజాగా యోగాపై పడ్డాడు.

Read More: Modi: మోడీ మంత్రి వ‌ర్గంలో మార్పులు… చాన్స్ కొట్టేసిన యువ‌నేత ఎవ‌రంటే..

ఇప్పుడు యోగాపై…
యోగా ప్రపంచానికి పరిచయం అయినప్పుడు భారత్ అనే దేశమే లేదని ఓలి ప్ర‌క‌టించాడు. యోగా పరిచయమైన సమయంలో భారత్ ఒక ఉపఖండం అని ఆయన అన్నారు. యోగాను కనుగొన్న నేపాల్ వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పలేకపోయామని ఓలి అన్నారు. ఈ విషయంలో మోడీ సక్సెస్ అయ్యారని నేపాల్ ప్ర‌ధాని అన్నారు. ఓలి కామెంట్ల నేప‌థ్యంలో భార‌త్ ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.


Share

Related posts

AP CM YS Jagan: విద్యార్థులకు శాపంగా మారిన లోకేష్ లేఖ..! అదేమిటంటే..?

somaraju sharma

బాబుపై రామచంద్రయ్య నిప్పులు!

somaraju sharma

‘రాష్ట్ర మహిళా కమిషన్ నిద్రపోతున్నదా!?’

somaraju sharma