Munna Gang Case: 17 హత్యలు చేసిన మున్నాని పట్టుకున్నది ఓ కానిస్టేబుల్..!? ఇది రియల్ ఠాగూర్ సీన్..!!

Share

Munna Gang Case: మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ “ఠాగూర్” సినిమా చూసే ఉంటారు.అందులో ఏసీఎఫ్ అనే సంస్థ అవినీతి అధికారులు అందర్నీ శిక్షించటం జరుగుతుంది.ఆ సంస్థ నాయకుడు చిరంజీవి అని,ఇదో పెద్ద నెట్వర్క్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతాధికారి వద్ద డ్రైవర్గా పనిచేసే ప్రకాష్ రాజ్ గుర్తిస్తారు.

A constable caught in the act of committing 17 murders ..!? This is the real Tagore scene .. !!
A constable caught in the act of committing 17 murders ..!? This is the real Tagore scene .. !!

ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆయన ప్రయత్నించినా ప్రకాష్ రాజ్ ను తేలిగ్గా తీసిపారేస్తుంటారు.చివరకు అతను చెప్పిందే నిజం కావడంతో అందరూ అవాక్కవుతారు.ఇది సినిమాలోనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో నిజంగా జరిగేది కూడా ఇదేనంటారు.ఏదైనా సంచలనాత్మక కేసులో బ్రేక్త్రూ లభించినప్పుడు ఉన్నతాధికారులు ఆ క్రెడిట్ కొట్టేస్తారు.తాజాగా ఉరి శిక్ష విధింపబడిన హైవే కిల్లర్ మున్నా కరడుగట్టిన నేరస్థుడని ముందుగా కనిపెట్టింది ఒక కానిస్టేబులే అన్నది నిప్పులాంటి నిజం.ఇప్పుడీ కేసులో ఘనతంతా పోలీసు ఉన్నతాధికారులకు పోతుండగా మున్నాను నేరచరితునిగా వెలుగులోకి తెచ్చిన కానిస్టేబుల్ ఎక్కడా కనిపించడం లేదు.

Munna Gang Case: అసలేం జరిగిందంటే?

మున్నా అనే ఒకడు నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని అందరి కన్నా ముందుగా కానిస్టేబుల్ చిన్నబోతుల శ్రీనివాసరావు గుర్తించాడు. ఇతనికి “చీరాల శ్రీను” అనే ముద్దు పేరు కూడా ఉంది.1994 లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరిన శ్రీను ఎక్కువకాలం కనిగిరి ,హనుమంతునిపాడు తదితర పశ్చిమ ప్రాంతాల్లో పని చేశాడు.ఈ క్రమంలోనే కనిగిరిలో 2002 సంవత్సరంలో ముస్లింల జంట హత్యలు జరిగాయి.

కలుగులోంచి మున్నాను బయటకు లాగిందిలా !

అప్పట్లో కనిగిరిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీను ఈ హత్య కేసుల విషయంలో శ్రద్ధ చూపి దర్యాఫ్తు చేశారు.సంఘటనా స్థలాన్ని అణువణువూ పరిశీలించి కొన్ని సాక్ష్యాధారాలు సేకరించారు.అనుమానం మీద నలుగురు ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించినప్పుడే మున్నా అనే ముష్కరుడు వెలుగులోకి వచ్చాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు మున్నా బావమరుదులే కావటం ఇక్కడ కొసమెరుపు.వారు ఇచ్చిన సమాచారంతో మున్నాను కూడా పట్టుకుని ఒక రహస్య ప్రదేశంలో విచారణకి తీసుకెళ్తే ఒకపట్టాన అతడు నోరు విప్పలేదు.నాలుగైదు రోజులు గడిచినా పోలీసు అధికారులు ఎంత ప్రయత్నించినా విచారణ ముందుకు సాగలేదు.ఈ నేపధ్యంలో అప్పటి జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి విచారణ ప్రక్రియను పరిశీలించడానికి రాగా చీరాల శ్రీను ఆయన అనుమతి తీసుకొని మున్నాను విచారించాడు. ఆశ్చర్యకరంగా చీరాల శ్రీను ఇంటరాగేషన్ మొదలుపెట్టిన పది నిమిషాల్లోనే మున్నా నోరు తెరిచాడు. నేరాన్ని అంగీకరించాడు. గతంలో తాను చేసిన నేరాలన్నింటినీ కూడా ఒప్పుకున్నాడు. అడిషనల్ ఎస్పీ సమక్షంలోనే అంగీకార పత్రంపై సంతకం కూడా చేశాడు.తద్వారా మున్నా అనే కరుడుగట్టిన నేరస్థుడు ఒకడున్నాడని సమాజానికి చాటిచెప్పిన ఘనతను ఈ చీరాల శ్రీను అనే కానిస్టేబుల్ సొంతం చేసుకున్నాడు.

Read More: Breaking: ఆకలి తీరుస్తామని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు..!!

ఆ లీడ్స్ ఇప్పుడు ఉపయోగపడ్డాయి!

అప్పటి ఆ లీడ్స్ జాతీయ రహదారిపై మున్నా సాగించిన హత్యాకాండ దర్యాప్తులో ఎంతగానో ఉపయోగపడే అతన్ని పట్టుకోవటానికి ఉపయోగపడ్డాయన్నది వాస్తవం. మున్నా గ్యాంగులో పన్నెండు మంది కి ఉరిశిక్ష పడిన ఈ సందర్భంలో కానిస్టేబుల్ చీరాల శ్రీను గురించి చెప్పుకొని తీరాల్సిందే.హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

 


Share

Related posts

raiza wilson Joshful looks

Gallery Desk

బిగ్ బాస్ 4: దెబ్బకి ఒకటైపోయిన అభిజిత్, అఖిల్..!!

sekhar

శ్రీశైలం ప్రమాదం వెనుక ఇంత జరిగిందా..? కారణాలు తెలిస్తే షాక్..!!

somaraju sharma