NewsOrbit
న్యూస్

వైజాగ్ లో పీవీ సింధు అకాడమీ

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు శుక్రవారం భేటీ అయ్యారు. తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు… ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు అభినందనలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సెక్రటేరియట్‌ లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు.

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందని సింధు అన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపింది. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు.

గోల్డ్‌ మెడల్‌ సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా ఏపీకి వచ్చిన పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వచ్చే ఒలంపిక్స్‌ లో కూడా సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సిఎం కోరుకున్నారని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సిఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం డగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Leave a Comment