Tonsils: టాన్సిల్స్ అనేవి గొంతులో ఇన్ఫెక్షన్స్ కలగజేయడం. గొంతులో రెండు వైపులా టాన్సిల్స్ ఉంటాయి ఇవి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి బయటి నుంచి వచ్చే సూక్ష్మక్రిములను కాలుష్య కారక పదార్థాలను శరీరంలోకి రాకుండా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. ఈ టాన్సిల్స్ సమస్య పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో చాలా మంది చిన్న పిల్లలు టాన్సిల్స్ తో బాధపడుతూ ఉంటారు.. టాన్సిల్స్ శోషరస కణజాలముల ఇరువైపులా చిన్న గడ్డలా ఉంటాయి. వీటి సైజు పెరగడం వలన గొంతు నొప్పి, జ్వరం వస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ కారక క్రిములు ఎక్కువ కావడం వలన ఇన్ఫెక్షన్ సమస్య తీవ్రంగా మారుతుంది. చల్లటి పానీయాలు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంటే సమస్య మరింత జటిలమవుతుంది.. టాన్సిల్స్ కు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి..!! టాన్సిల్స్ కు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా తయారు చేసుకునీ వాడితే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!

Tonsils: టాన్సిల్స్ కు చెక్ పెట్టే చక్కటి ఆయుర్వేద చిట్కా తయారు చేసుకునే విధానం..!!
కావలసిన పదార్థాలు:
ఉత్తరేణి ఆకులు పచ్చివి – 100 గ్రాములు, అంకుడు చెట్టు ఇగుర్లు – 100 గ్రాములు, వెల్లుల్లి – 20 గ్రాములు మిరియాలు – 20 గ్రాములు.
పైన చెప్పిన పదార్థాలన్నింటిని సేకరించి శుభ్రపరచుకోవాలి. వీటన్నింటిని మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజ పరిమాణం లో మాత్రలు తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మాత్రలను ఉదయం, రాత్రి భోజనానికి ముందు రెండు మందులు నీటిలో కలిపి తీసుకోవాలి. చిన్న పిల్లలకైతే రోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి నీటితో తీసుకోవాలి. పెద్దవాళ్ల కు రోజు ఉదయం మూడు మాత్రలు, రాత్రి మూడు మాత్రలు నీటితో కలిపి వేసుకోవాలి. ఇలా మూడు నెలలు వాడటం వాడితే గొంతు లో గడ్డలు, టాన్సిల్స్, గొంతు లోని ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి పూర్తిగా తగ్గుతుంది. చాలామంది టాన్సిల్స్ కు ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ మందులు వేసుకోవడం వల్ల ఆపరేషన్ చేయించుకునే అవసరం ఉండదు. ఇన్ఫెక్షన్తో నే తగ్గుతుంది. కాబట్టి గొంతు నొప్పి, గొంతులో గడ్డలు, టాన్సిల్స్ తో ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.