ప్రోటోకాల్.. జిల్ జిల్ జిగేల్ : మోదీతో రాజకీయం చేయగలవా రేవంత్?

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాజకీయం చేయాలంటే పులి నోట్లో తల పెట్టి యుద్ధం చేయాలి… ఎన్నో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసి దానికనుగుణంగా ఓ ప్రణాళిక ప్రకారం వెళ్లి మోడీని ఢీ కొంటేనే కాస్తో కూస్తో ప్రయోజనం. అప్పటికి మోడీ తప్పు తేలిన అతడి సాంకేతిక సైన్యం ఆ తప్పును కవర్ చేసేందుకు వందకు వందశాతం పని చేస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేవదీసిన ప్రోటోకాల్ వివాదం తిరిగి తిరిగి రేవంత్ మెడకే చుట్టుకునేలా ఉంది. మల్కాజ్గిరి ఎంపీ అయిన తనకు కనీసం ఏ మాత్రం సమాచారం ప్రోటోకాల్ పాటించకుండా ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు శనివారం వచ్చారంటూ ఆయన వేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. అసలు మోడీ వచ్చింది అధికారిక కార్యక్రమం కాదని అలాంటప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు అంటూ పీఎంవో నుంచి అధికారికంగా రేవంత్ రెడ్డికి బదులు వచ్చిన… హైదరాబాద్ వచ్చి కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోదీ సమాచారం ఇవ్వక పోవడం ఏమిటని వా రాజకీయ చర్చ జరుగుతోంది. అసలు కోడి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ చెప్పే రావాలా అన్నది ఒక సారి పరిశీలిస్తే…

ప్రోటోకాల్ అవసరమే కానీ…

భారతదేశ ప్రధానమంత్రి కి ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాలు సమావేశాల్లో పాల్గొనే సమయంలో ఒక రకమైన ప్రోటోకాల్ అమలైతే, అయినా వ్యక్తిగత విషయాలు ఇతర పరిశీలనలు ప్రత్యేక సదస్సును సమయంలో ఒక రకమైన ప్రోటోకాల్ అనుసరిస్తారు.
*అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు తప్పనిసరిగా క్రమ పద్ధతిలో హోదా ప్రకారం అందరికీ ప్రోటోకాల్ వర్తింపజేస్తారు. దీనిని ప్రధాన మంత్రి కార్యాలయం పక్కాగా నిర్వహిస్తుంది. దీనికోసం నలుగురు ఐఏఎస్ అధికారుల టీమ్ పని చేస్తుంది. భద్రతాపరంగా ఎస్ పి ఎఫ్ ప్రధాని భద్రత ను చూస్తే ఆయన ప్రోటోకాల్ విషయంలో ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుంది. వీరే పుస్తకాల్లో మొదట ఎవరు కలవాలి ప్రధానమంత్రి ఏ ప్రకారం కలవాలి ఎంత దూరం నిలబడాలి అనే అంశాలను సైతం జాగ్రత్తగా గమనించి తగు విధంగా ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచనలు ఇస్తారు. రెండో రకం గా ఉండే వ్యక్తిగత, పరిశీలన అంశాల్లో ప్రధాని పర్యటన ఉన్నప్పుడు ప్రోటోకాల్ వర్తించదు. ప్రధాని అభిమతానికి అనుగుణంగా దీనిని ప్రభాకర్ తయారు చేస్తారు లేదా అసలు రోగాలు లేకుండా అని ఆయన పర్యటన ఉండవచ్చు.

హైదరాబాద్ కార్యక్రమం ఇలాంటిదే

దేశంలో వివిధ ల్యాబ్ లో అభివృద్ధి లో ఉన్న కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు శనివారం ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అభివృద్ధి లో ఉన్న మూడు ల్యాబ్ లలో పరిశీలనకు పర్యటన రూపొందించుకున్నారు. హైదరాబాద్ భారత్ బయోటెక్ ల్యాబ్ కూడా దీనిలో ఒకటి. ఎక్కడ తొలి దశలో ఉన్న భారత్ బయోటిక్ కరోనా వ్యాక్సిన్ పరిశీలించేందుకు మాత్రమే మోదీ హైదరాబాద్ పర్యటన పెట్టుకున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో ఆయన ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని, ఇదేమీ అధికారిక కార్యక్రమం కాదని కేవలం పరిశీలనకు మాత్రమే ప్రధాని వచ్చారని వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో ఎవరికి ప్రోటోకాల్ అమలు చేయలేమని కూడా స్పష్టం చేశాయి.

కావాలనే రాజకీయం

రేవంత్ రెడ్డి ఇలాంటి నాయకుడికి ప్రధాని ప్రోటోకాల్ విషయాలు తెలియక కావు.. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు మాత్రమే రేవంత్ ట్వీట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిఎంఓ లో ప్రోటోకాల్ ప్రత్యేక విభాగం ఉంటుంది. వీరు ఎవరు చెప్పినా సరే ప్రోటోకాల్ ను మార్చే పరిస్థితి ఉండదు. ప్రధాని పర్యటన పూర్తిగా పరిశీలనకు వచ్చే అంశం కావడంతో ప్రోటోకాల్ను పాటించాల్సిన అవసరం లేదనే దీనికి స్థానిక నేతలు ఎవరికీ చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం దీనిపై సమాచారం ఇవ్వలేదు. దీన్ని తమకు అనుకూలంగా గ్రేటర్ ఎన్నికల్లో వాడుకోవాలని భావించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి తిరిగి ఈ వ్యవహారం మెడకు చుట్టుకునేలా ఉంది. పీఎంఓ దీనిపై రేవంత్ రెడ్డికి తగిన నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.