కర్నూలు: యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అఖిలప్రియ సోమవారం ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో డ్రిల్లింగ్ పనులను నిలిపివేసి సిబ్బంది యంత్రాలను తొలగిస్తున్న పనులను సోమవారం ఉదయం చూసినట్లు అఖిలప్రియ పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ అఖిలప్రియ పాల్గొని యురేనియం తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.
I would like to thank everyone who have supported #savenallamalla and #save_allagadda. Today morning we have seen the uranium drilling have been stopped and machinery is being removed. We shall keep fighting till it stops completely.@ncbn @naralokesh @PawanKalyan @CPIparty pic.twitter.com/pF7tIDXUdS
— Bhuma Akhila Reddy (@bhuma_akhila) September 30, 2019