NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 10 Today Episode: చావులో కూడా దీపకు తోడుగా ఉంటానన్నా కార్తీక్ తన మాట నిలబెట్టుకుంటాడా..??

Karthika Deepam Mar 10 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే కార్తీకదీపం సీరియల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం మొదటి రోజు నుంచి కార్తీక్, దీప, హిమ కార్ ఆక్సిడెంట్ లో చనిపోవడం, వాళ్ళ ఫోటోలకు దండలు వేయడం లాంటి ప్రోమోను చూపించి ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తిని రేకేత్తించారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కధ ఎలాంటి మలుపు తిరిగిందంటే చిక్‌మంగళూరులో విహార యాత్రకు వెళ్లిన కార్తీక్, దీప కుటుంబం పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కార్తీక్, దీప కలిసి ఆనందంగా ఉండడం చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది.అయితే ఆ ఆనందాన్ని డైరెక్టర్ ఎక్కువ సేపు కూడా ఉంచలేదు అనుకోండి.. రాత్రి మందు తాగి రచ్చ రచ్చ చేసిన దీపను ఉదయమే కార్తీక్ లేపి గుడ్ మార్నింగ్ మేడమ్ అంటూ పలకరిస్తాడు..

Karthika Deepam : మందు తాగి రచ్చ రచ్చ చేసిన వంటలక్క… దీపలో మరో కోణాన్ని చూసి షాక్ లో కార్తీక్..!

Karthika Deepam Mar 10 Today Episode: చావులో కూడా దీపకు తోడుగా ఉంటానన్న కార్తీక్ :

ఆ తరువాత చిక్ మంగళూరులో కార్తీక్ కుటుంబం అనేక ప్రదేశాలు సందర్శిస్తూ ఫోటోలు తీసుకొంటూ ఉంటారు.కార్తీక్, దీపను శౌర్య ఫోటోలు తీస్తూ నాన్నను పట్టుకో అమ్మ అంటుంది. ఆ తరువాత కార్తీక్ ను నాన్న నువ్వైనా అమ్మను పట్టుకో అంటే నేను చచ్చేదాక అమ్మను వదలను అంటూ కార్తీక్ అంటాడు.అలా అనకండి డాక్టర్ బాబు అంటూ కార్తీక్ నోరును ముస్తుంది దీప.ఆ తర్వాత కారు నడుపుతాను అంటూ హిమ మళ్ళీ పట్టుబట్టింది. అయితే కార్తీక్ వద్దు అంటే హిమ కాస్త అలుగుతుంది.హిమకు కారు నడిపించాలనే పిచ్చి పట్టింది అంటే.. చిన్నప్పుడు నేను కూడా అలానే చేసే వాడిని అంటూ కార్తీక్ హిమను ఒళ్ళో కూర్చోపెట్టుకొని కారు నడిపించుకొంటూ ముందుకు వెళ్లారు.

Karthika Deepam Mar 7 Today Episode: కార్తీకదీపం సీరియల్ క్లైమాక్స్ కు చేరానుందా..?మళ్ళీ కార్తీక్, దీపల ఎడబాటు తప్పదా..??
హిమ డ్రైవింగ్ పిచ్చితో కార్తీక్ కుటుంబం బలి కానుందా..?

కార్తీక్ కారు నడుపుతుండగా.. హిమ స్టీరింగ్ తిప్పుతూ నాకు కారు డ్రైవింగ్ వచ్చేసింది అంటే.. స్టీరింగ్ తిప్పడం వస్తే.. కారు డ్రైవింగ్ వచ్చినట్టు కాదు అని కార్తీక్ అంటే.. హిమను వెనుకకు పంపించు.. కారు డ్రైవింగ్ ఏమిటి అంటూ దీప అసహనం వ్యక్తం చేసింది.దాంతో ఈ కొండలు, గుట్టల్లో హోటల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావా?అంటాడు కార్తీక్. నేను హోటలు పెట్టను,వంటలు చేయను నీవు ఎక్కడుంటే.. నేను అక్కడే ఉంటాను. నిన్ను వదలి నేను ఉండను అంటూ దీప సమాధానం చెప్పింది. దాంతో మనం ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్దాం అంటూ శౌర్య అంటుంది.

Karthika Deepam Mar8 Today Episode: దీప భయం నిజం కానుందా.వాళ్లకు ఇదే చివరి రోజా..??
ఫంక్షన్ కు రాను అని సౌందర్య ఎందుకు అందంటే..?

సీన్ కట్ చేస్తే ఆదిత్య, ఆనందరావులు సౌందర్యను ఫంక్షన్ కు రమ్మని అడుగుతారు. కానీ సౌందర్య మాత్రం. కార్తీక్ గురించిన ఆలోచనలతో ఆందోళనలో ఉంటుంది.కార్తీక్‌కు ఫోన్ కలిసి ఉంటే అమ్మ ప్రశాంతంగా ఉండేది అని ఆదిత్య అంటాడు.కానీ నెట్ వర్క్ ప్రాబ్లెం వల్ల కాల్ కలువడం లేదు. అన్నయ్య కూడా ఫోన్ చేయడం లేదు అంటాడు.. అలా కాసేపు బయటకు ఫంక్షన్ కి వెళదాం రా మమ్మి అని ఆదిత్య అంటే మీరు వెళ్లి రండి.. నేను రాలేను అని అంటుంది. నాకు మానసికంగా ప్రశాంతత లేదు. మీ ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు.నేను ఇంట్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి అంటే దాంతో ఆదిత్య, ఆనందరావు, శ్రావ్య ఫంక్షన్‌కు వెళ్లిపోతారు.ఇక సౌందర్య మాత్రం పూజారి చెప్పిన విషయాన్ని తలుచుకుని ఏదో ఊహించని సంఘటన జరుగుతుందని నా మనసు కీడు శంకిస్తున్నది అనుకుంటూ మళ్ళి కార్తీక్ కు ఫోన్ చేస్తుంది.

Karthika Deepam : మందు తాగి రచ్చ రచ్చ చేసిన వంటలక్క… దీపలో మరో కోణాన్ని చూసి షాక్ లో కార్తీక్..!
సౌర్యను అనాథను చేసి చచ్చిపోయిన కార్తీక్, దీప, హిమలు :

ఇక హిమ కారు నడుపుతుండగా మొబైల్‌లో మెసేజ్ రావడంతో నెట్ వర్క్ వస్తుందేమో అంటూ కార్తీక్ ఫోన్ చూశాడు. మమ్మి నుంచి చాలా మిస్ కాల్స్ వచ్చాయి ఏంటి? అంటూ కారు పక్కనే ఆపాడు.కాల్ చేయడానికి ప్రయత్నిస్తే.. నెట్ వర్క్ లభించలేదు. దాంతో నెట్‌వర్క్ కోసం ప్రయత్నిస్తూ కార్తీక్ ముందుకు వెళ్లడంతో దీప కూడా కార్తీక్ తో వెళ్లేందుకు ప్రయత్నించగా హిమ ఆపుతుంది.మరోపక్క నేను కూడా నాన్నమ్మకు ఫోన్ ట్రై చేస్తానంటూ శౌర్య పక్కకు వెళ్లడంతో బలవంతంగా తల్లి దీపను కారులో కూర్చోపెట్టింది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లింది.వద్దు హిమ అని ఎంత చెప్పిన వినదు. ఆ తరువాత కారు కంట్రోల్ తప్పడంతో దీప భయపడిపోయి డాక్టర్ బాబు అని అరవడంతో హిమ కారు నడుపుతూ ముందుకు తీసుకెళ్లడం చూసిన కార్తీక్ షాక్ అయ్యి కారు వెంట పరుగెత్తుతూ చివరకు కారు డోర్ తీసి లోనికి వెళ్తాడు. అయితే అంతలోనే రాయిపైకి కారు ఎక్కి లోయలోకి పడి పేలి పోతుంది.ఆ తర్వాత కార్తీక్, దీప, హిమ ఫోటోలకు సౌందర్యం ఇంట్లో దండలు వేసి చూపించడంతో కధనం మరింత ఆసక్తిని రేపింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju