NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam: దీపను అవమానించిన ఊరుజనం..!అండగా రాజ్యలక్ష్మి ఉంటుందా.. ఆమె కూడా మోనితనే సపోర్ట్ చేస్తుందా..!!

Karthikadeepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1477 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 8 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది.గత ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ ను తీసుకుని దసరా ఉత్సవాలకి తను క్రియేట్ చేసిన ఊరికి తీసుకుని వెళ్తుంది. మరో. పక్క దీప కూడా కార్తీక్ బాబును ఏతుకుంటూ డాక్టర్ అన్నయ్య, వాల్ల అమ్మతో కలిసి బయలుదేరింది. ఈ క్రమంలోనే సౌర్య, ఇంద్రమ్మ, చంద్రుడు కూడా దీప వాళ్ళు వెళ్లిన దారిలోనే వెళ్తారు కానీ సౌర్య, దీప ఒకరినొకరు చూసుకోరు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. మోనిత నేత్ర దాన శిబిరం. దగ్గర కారు ఆపి కార్తీక్ ను అక్కడికి తీసుకుని వెళ్లి అక్కడ ఫారం నిపుతుంది. సరిగ్గా వైఫ్ అఫ్ కార్తీక్ అని రాసే దగ్గర కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ భార్యగా నాపేరు రాయడం అనేది నా లైఫ్ అంబిషన్ అని, అలా రాస్తే వచ్చే కిక్ వేరు అనుకుంటూ సరిగ్గా పేరు రాసే సమయానికి దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసిన మోనిత వచ్చావా కరెక్ట్ టైమ్ కు వస్తావే అని మనసులో అనుకుంటుంది.

నిను విడను నీడను నేనే అంటూ మోనితను ఫాలో అవుతున్న దీప :

Deepa karthik monitha


దీప వచ్చాక ఏంటి డాక్టర్ బాబు రాత్రి నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా.. అన్నదానం, పండ్ల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పాను కదా అంటే హ అవును అన్నావ్ దీప. కానీ మోనితకు కూడా నేనేదో మాట ఇచ్చాను అని అనడంతో దీప మోనిత వంక కోపంగా చూస్తుంది. ఇక దీప మాత్రం ఏంటి డాక్టర్ అమ్మ డాక్టర్ బాబుకి మీరైనా గుర్తు చేయాలి కదా అని దీప అంటే మౌనిత మాత్రం మా ఊరిలో సంబరాలు బాగా జరుగుతాయి అక్కడికి వస్తాం అని చెప్పి మేము మొక్కుకున్నాము అని అబద్ధం చెప్తుంది. ఇక కార్తీక్ మాత్రం సర్లే కాని వంటలక్క నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. ఇది కూడా మా ఊరే కదా డాక్టర్ బాబు అని చెప్పి దీపా అంటుంది కదా మర్చిపోయాను దీపా అని నేను కార్తీక్ అంటాడు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి డాక్టర్ మీరు కూడా వచ్చారు అంటే అనుకోకుండా మాది కూడా ఈ ఊరే అవటంతో మేము కూడా దీపతో పాటు కలిసి ఇక్కడికి వచ్చాము అనటంతో మౌనిక మనసులో వీళ్ళేదో పెద్ద ప్లాన్ లోనే వచ్చారు అనుకుని కార్తీకుని హడావిడిగా అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక దీప వాళ్ళ కారు వెనకాలి శౌర్య వాళ్ళ ఆటో కూడా వచ్చి ఆగుతుంది. బాబాయ్ నువ్వు వెళ్లి నేత్రదానం కి ఫారం ఫిల్ చేసిరా అని చెప్పి సౌర్యను చంద్రమ్మ పక్కకి వెళ్తారు. అప్పుడు కూడా దీప, సౌర్య ఒకరినొకరు చూసుకోరు..

మోనిత సృష్టించిన కొత్త ఊరుకు వచ్చిన కార్తీక్ :

Karthik monitha kaveri




సీన్ కట్ చేస్తే మోనిత కార్తీక్ ను తీసుకుని కావేరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ సంబరాలు బాగా జరుగుతాయి అని కావేరి అంటే అవును అవి చూడడానికే మేము వచ్చాము అని మోనిత అంటుంది. కార్తీక్ అనుమనంగా అదేంటి మన ఊరు అన్నావ్ ప్రతి సంవత్సరం ఇక్కడ సంబరాలు బాగా చేస్తారు కదా ప్రత్యేకంగా చూడడానికి వచ్చాము అంటావేంటి అంటాడు కార్తీక్. ఇక మోనిత మాత్రం తడుముకుంటూ ఏదోలా కవర్ చేస్తుంది. సర్లే గాని మోనిత అప్పుడు చాలా మంది వచ్చి నన్ను పలకరించారు మరి ఇప్పుడు ఎవరు రావడం లేదు అంటాడు కార్తీక్. అప్పుడే కావేరి అక్కడ ఉన్న ఇద్దరికి సైగ చేస్తుంది.

రాజ్యలక్ష్మిని కలిసిన దీప :

Deepa rajyalakshmi


అప్పుడు వాళ్ళు వచ్చి బాగున్నావా కార్తీక్ బాబు,బావున్నావా మోనితమ్మా అని పలకరిస్తారు.అలాగే మీరు మా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసారు దండాలు అంటాడు. కార్తీక్ కు అస్పష్టంగా గతంలో జరిగిన సౌర్య మాటలు గుర్తుకు వస్తాయి. మళ్ళీ మోనిత ఏదోలా కవర్ చేసి కార్తీక్ ను డైవర్ట్ చేసి ఊరు చూద్దాంరా అని తీసుకుని వెళ్తుంది. దీప, డాక్టర్ వాళ్ళు ఆ ఊరు పెద్ద రాజ్యలక్ష్మి దగ్గరకు వస్తారు. జరిగిన విషయాలు అన్ని చెప్పగానే రాజ్యలక్షి పండగ అయ్యాక మాట్లాడదాం అని అంటుంది.

దీపను కార్తీక్ ముందు అవమానించిన ఊరి జనం :

Deepa karthik



ఇక కార్తీక్, మోనిత ఊళ్ళోకి వెళ్ళగానే దీప కనిపిస్తుంది.వంటలక్క నీ భర్త ఎవరో చెప్పు నేను వచ్చి మాట్లాడతాను అంటే సరే డాక్టర్ బాబు చూపిస్తా పదండి వెళదాం అంటే మోనిత షాక్ అవుతుంది. ఇంతలో మోనిత పక్కనే ఉన్న కావేరికి సైగ చేయగానే అక్కడ ఉన్న ఆడవాళ్లు కొందరు కార్తీక్, దీప, మోనిత దగ్గరకు వచ్చి ఏమే వంటలక్క నువ్వు ఇంకా మారలేదా అంటూ దీపను నానా మాటలు అని వెళ్ళిపోతారు. ఇక దీప ఏదో చెప్పబోతుందంటే కార్తీక్ మాత్రం ఆపు వంటలక్క నాకు కాస్త చిరాకుగా ఉంది రేపు మాట్లాడతాను అని చెప్పి విసుగ్గా వెళ్ళిపోతాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో అందరూ కలిసి రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పాటలు పాడి ఆటలు ఆడతారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?