జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్

(న్యూస్ఆర్‌బిట్ బ్యూరో)

పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో కేసీఆర్‌, కుటంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోణార్క్‌ ఆలయాన్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన కోల్‌కతా వెళతారు. పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఆదివారం ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.