NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్‌పై ఉన్న నమ్మకమే ఆ మంత్రికి మంచి చేసింది..ఆ కీలక వ్యాఖ్యల ఫలితమే..!

YSRCP: చాలా మంది రాజకీయ నాయకులకు పదవే పరమావధిగా ఉంటుంది. పదవి లేకపోతే క్షణం కూడా ఉండలేరు. ఉన్న పార్టీలో ఎమ్మెల్యే లేదా ఎంపీ దక్కకపోతే ఆ సిట్టింగ్ వెంటనే పక్క పార్టీకి జంప్ అయ్యే రోజులు ఇవి. ఎన్నికల సమయంలో జంపింగ్ జపాంగ్ లు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నుండి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారు.

టికెట్ రాని కొందరు మాత్రం ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. కొందరు హైకమాండ్ నుండి ఇచ్చిన హామీలతో పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి వేరే వ్యక్తికి ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించినా ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా జగన్ పై నమ్మకంతో ఉన్నారు మంత్రి గుడివాడ అమరనాథ్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి అమర్నాధ్ విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే అనకాపల్లికి పార్టీ అధిష్టానం ఇటీవల మలసాల భరత్ ను నియమించింది. ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్నాధ్ కు మరో నియోజకవర్గాన్ని కేటాయించలేదు. ఇటీవల జగన్ పాల్గొన్న సభలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది నీ పరిస్థితి ఏమిటి..ఎక్కడ పోటీ చేస్తానని అడుగుతున్నారు.. నాకు 15 నియోజకవర్గాల బాధ్యతను సీఎం జగన్ అప్పగించారు. 15 నియోజకవర్గాలను గెలిపించి .. మళ్లీ జగన్ ను సీ ఎం చేసుకుంటాము. అవసరమైతే నేను పోటీ నుండి తప్పుకుంటా. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు. నా తలరాత జగన్ మోహన్ రెడ్డి రాస్తారు’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

AP Employees JAC to meet cm jagan tomorrow
cm jagan

ఈ వ్యాఖ్యలతో జగన్ పై మంత్రి అమర్నాధ్ ఎంత నమ్మకంతో ఉన్నారు అనేది అర్ధం అయ్యింది. అమర్నాధ్ భక్తికి మెచ్చిన జగన్ .. తాజాగా జాబితాలో ఆయనను గాజువాక ఇన్ చార్జిగా నియమించారు. ఇంతకు ముందు అక్కడ (గాజువాక) సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండగా, ఆయనను తప్పించి వరికూటి చందును ఇన్ చార్జిగా నియమించింది పార్టీ అధిష్టానం. ఇప్పుడు అమర్నాథ్ కోసం వరికూటి చందును పక్కన పెట్టారు సీఎం జగన్.

తాజా జాబితాలో చిలకలూరిపేట నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జిగా కావటి మనోహర్ నాయుడుని పార్టీ నియమించింది. ఇంతకు ముందు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజినిని గుంటూరు కు పంపిన నేపథ్యంలో ఆమె స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని ఇన్ చార్జిగా నియమించారు. అయితే విడదల రజినికి రాజేష్ నాయుడికి మధ్య విభేదాలు రావడం, రజినిపై రాజేష్ నాయుడు  ఆరోపణలు చేయడంతో పాటు పార్టీ అధిష్టానంపైనా అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజేష్ నాయుడును తప్పించి చిలకలూరిపేటకు కొత్త ఇన్ చార్జిగా కావటి మనోహర్ నాయుడుని నియమించారు.

PM Modi: ఏపీలో మోడీ పర్యటన ఖరారు .. చంద్రబాబుకు పీఎంఓ నుండి సమాచారం

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju