Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ “పుష్ప” ద్వారా సెట్ చేసుకోవడం జరిగింది. “పుష్ప” రాకముందు దక్షిణాదిలో పాపులర్…గా ఉన్న బన్నీ “పుష్ప” సినిమాతో … ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకపక్క విజయాలు సాధిస్తూనే మరోపక్క బన్నీ మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన పేద యువతి చదువుకు బన్నీ చేసిన సాయానికి కేరళ కలెక్టర్ పొగడ్తలతో ముంచేత్తారు.
నర్సింగ్ విద్య పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్న ఓ ముస్లిం యువతికి నాలుగేళ్ల చదువుకు సంబంధించిన పూర్తి ఫీజు అన్ని ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందట. చదువులో ఎంతో చురుగ్గా ఉండే ఆ విద్యార్థిని.. ఫీజు విషయంలో పడుతున్న కష్టాలను విద్యను అభ్యసించడానికి తన ముందున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చి సాయం చేయాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో ఇంటర్ విద్యలో 92 శాతం మార్కులు వచ్చాయని.. అయితే గత సంవత్సరం తండ్రి కరోనాతో మరణించడంతో… ఆర్థిక ఇబ్బందులు ఎదురై చదువు కొనసాగించలేకపోయినట్లు.. ఈ క్రమంలో తన వంతుగా ఆమె కొంత సహకారం అందించమని కోరారు.
అంతేకాదు ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ ఇప్పించాలని అన్నారు. ఈ మొత్తం విషయాన్ని బన్నీ దృష్టికి తీసుకు వచ్చాను అని అలాపూజ జిల్లా కలెక్టర్ వి ఆర్ కృష్ణ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వెంటనే బన్నీ స్పందించి సదరు ముస్లిం యువతి నాలుగేళ్ల కోర్స్ ఫీజు మొత్తం కట్టడానికి ఒప్పుకోవటం నిజంగా సంతోషించదగ్గ విషయమని కేరళ కలెక్టర్ బన్నీ సేవాగుణంపై ప్రశంసల వర్షం కురిపించారు.