Bheemla Naayak: టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా పరంగా లేదా బాక్సాఫీస్ దగ్గర పవన్ సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం కామన్. పవన్ సినిమా రిలీజవుతుందంటే చాలు… ఆ రోజు మరే హీరో సినిమా.. దరిదాపుల్లో ఉండదు. మిగతా సినిమాల నిర్మాతలు పవన్ సినిమా రిలీజ్ అయ్యే టైంలో… తమ సినిమాలను రిలీజ్ చేయరు. ఎందుకంటే ఆ వారం రోజుల్లో దాదాపు పవన్ సినిమా చుట్టూ మార్కెట్ ఉంటుంది. సోషల్ మీడియాలో పవన్ సినిమా టీజర్.. లేదా ఫోటోలు అనేక రికార్డులు క్రియేట్ చేయటం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొన్నటి వరకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ విధంగా ఉంటే తాజాగా….”బీమ్లా నాయక్” కి సంబంధించి అభిమానులకి బ్యాడ్ న్యూస్. విషయంలోకి వెళితే ఇటీవల ఈ సినిమా టెలివిజన్ లో ప్రసారం కావడం జరిగింది. కనీసం టిఆర్పి రేటింగ్ లలో మినిమం నెంబర్ కూడా సాధించలేదు. ఈ సినిమాకి ముందు బాలకృష్ణ “అఖండ” థియేటర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాదు టెలివిజన్ రంగంలో కూడా టిఆర్పి రేటింగ్ లలో సత్తా చాటింది.
మరి పవన్ సినిమా ….”బీమ్లా నాయక్” ఏమాత్రం టిఆర్పి రేటింగ్ సాధించకపోవడం అందరికీ షాక్ కు గురిచేసింది. “బీమ్లా నాయక్” ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 200 కోట్ల రూపాయల దిశగా కలెక్షన్స్ సాధించింది. మరి ఇటువంటి సినిమా టెలివిజన్ రేటింగ్ లలో సత్తా చాట కాకపోవటం అందరికీ షాక్ కు గురి చేసింది.