స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలను కమిట్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో `ఎం.సి.ఎ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్ కనపడుటలేదు` సినిమాను చేయాల్సి ఉంది. అయితే అంత కంటే ముందు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలి. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. తర్వాతే `ఐకాన్ కనపడుటలేదు` వరుసలోకి రానుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ జతగా రాశీఖన్నా నటిస్తుందట. ఇప్పటికే మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సరసన నటించిన రాశీకి బన్నీతో చేయడం లక్కీ అని సినీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post