Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్లో 150 సినిమాల కి పైగా నటించిన చిరు ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస డిజాస్టర్ల మధ్యలో ఉన్నాడు. కనుక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే చిరు మళ్లీ ఫామ్ లోకి వస్తాడని చెప్పొచ్చు.
ఇక విశ్వంభరాపై చిరు అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులో చిరుకి జోడీగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. సుమారు 18 ఏళ్ల తరువాత వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. దీంతో వీరిద్దరి అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురుచూస్తున్నారు.
అదేవిధంగా ఈ మూవీలో ఇషా చావ్లా , సురభి అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. వీరిపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్ గా వీరిద్దరితో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 26 నుంచి హైదరాబాదులో మరో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.
అందులో త్రిష తో పాటు ఈశా మరియు సురభి కూడా పాల్గొనున్నారట. మరి ఈ సినిమాలో వీరిద్దరి పాత్రకి మంచి ప్రాధాన్యత దక్కితే మాత్రం మరిన్ని అవకాశాలు దక్కుతాయని చెప్పొచ్చు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కి వశిస్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీ క్రియేషన్స్ సమస్త గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.