కొన్ని టైటిల్స్ చాలా విచిత్రంగా..ఆకట్టుకునేలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి టైటిల్‌ను తన సినిమాకు పెట్టాలనుకుంటున్నాడట దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఈ నటుడు, దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా `ఊహలు గుసగుసలాడే` ఈ సినిమాతో నాగశౌర్య కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా దర్శకుడిగా అవసరాలకు, హీరోగా నాగశౌర్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం జో అచ్యుతానంద సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేదు. అయితే మేకింగ్ పరంగా సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెలలోనే చిత్రీకరణను జరుపుకోనుంది. కాగా ఈ సినిమాకు `పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి` అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. సినిమా ప్రారంభం కాక ముందు నుండి.. టైటిల్ పరంగా కూడా క్యాచీగా, ఆకట్టుకునేలా ఉండేలా యూనిట్ ప్లాన్ చేసుకుంటుంది.
previous post