నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్..యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పెడుతున్న పాటలు మరియు వీడియోలు.. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయడం జరిగింది. ఆగస్టు 12వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.
దీంతో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 20 కోట్లకు పైగానే కలెక్షన్ రావాలి. ఈ సినిమాలో రాజకీయ రంగంలో అవినీతి పాల్పడుతూ ప్రజల జీవితాలను ఆడుకునే కర్కశమైన నాయకులతో కలెక్టర్ పాత్రలో నితిన్ పోరాడే స్క్రిప్ట్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి… మహతీ స్వర సాగర్ మ్యూజిక్ అందించడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం తో తన చిన్ననాటి కోరిక తీర్చుకున్నట్లు తెలిపారు. విషయంలోకి వెళ్తే చిన్నప్పుడు స్కూలుకు వెళ్లే సమయంలో పెద్దయ్యక ఏమవుతావని అందరూ అడిగేవాళ్లు. దానికి నేను కలెక్టర్ అవుతానని చెప్పేవాడిని. కానీ పెద్ద అవుతూ ఉంటే మార్కులు తగ్గిపోతూ ఉండేవి. ఇప్పుడు “మాచర్ల నియోజకవర్గం” లో ఐఏఎస్ గా నటించడంతో నా ముచ్చట తీరింది అని నితిన్ చెప్పకోచ్చారు. దీంతో నితిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.