RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. చిరంజీవి వారసుడిగా తెలుగులో.. ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. రెండో సినిమా “మగధీర” తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత “జంజీర్” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ సమయంలో చరణ్ పై బాలీవుడ్ మీడియా విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అదే మీడియా రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేస్తుంది. ఒక బాలీవుడ్ మీడియా మాత్రమే కాదు అంతర్జాతీయ ఫిలిం సూపర్ స్టార్ గా “RRR” తో ఒక్కసారిగా చరణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. రామరాజు పాత్రలో చరణ్ నటన చాలామంది ఆకట్టుకుంది. ప్రపంచ సినిమా గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ సైతం… చరణ్ పెర్ఫార్మన్స్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.
“RRR” సినిమా చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో అందుకొని అవార్డు హాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్ అందుకున్నారు. విషయంలోకి వెళ్తే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో…”RRR” పలు అవార్డులు గెలిచింది. దీనిలో భాగంగా బెస్ట్ వాయిస్, మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్… స్పాట్ లైట్ అవార్డు రామ్ చరణ్ స్వీకరించడం జరిగింది.
ఇప్పటివరకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఏ నటుడు స్వీకరించలేకపోయారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచి… చరణ్ సత్తా చాటడం జరిగింది. చరణ్ కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు సెలబ్రెటీలు రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.