Animal: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నీ ఇప్పటివరకు ఎవరూ చూపించని కోణంలో ఈ సినిమాలో చూపించారు. తండ్రి కొడుకుల సెంటిమెంటు నేపథ్యంలో.. రివేంజ్ డ్రామా తరహాలో తెరకెక్కిన “యానిమల్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల లలో ₹236 కోట్లు..వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఆదివారం కలెక్షన్ లతో కలిపి దాదాపు 300 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇలానే కొనసాగితే మరో మూడు రోజులలో “యానిమల్” ₹500 కోట్ల కలెక్షన్ రాబటనున్నట్లు..ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాలో ఫస్ట్ ఆఫ్ రక్తపాతం సెకండాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలు.. చాలా ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. రష్మిక… రణబీర్ రొమాన్స్ సన్నివేశాలు కూడా.. యూత్ నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలో విలన్ పాత్రలో బాబి డియోల్ నటన మరో నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తండ్రీ కొడుకుల నేపథ్యంలో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు… సినిమా చూసే ఆడియన్స్ కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించాయి.కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ “యానిమల్” సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
చాలా కొత్త రకంగా సినిమాలో కథనం ఉంది. సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా అర్జున్ రెడ్డి కంటే పది రెట్లు యానిమల్ ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో అనిల్ కపూర్.. నటనలో వీర లెవెల్ లో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో భారీ స్పందనతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజులలో ఈ సినిమా విదేశాలలో 9.6 మిలియన్ డాలర్లను వసూలు చేసిందట. తాజా కలెక్షన్లతో షారుక్ ఈ ఏడాది తీసిన జవాన్, పఠాన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగువేల థియేటర్లకు పైగా “యానిమల్” సినిమా విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాదిలో షారుక్.. జవాన్, పఠాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ సినిమాలు. ఇప్పుడు ఆ రెండు సినిమాల రికార్డులను రణబీర్ కపూర్ “యానిమల్” తుడుచుపెట్టుకుపోతుంది.