KGF 2: “కేజీఎఫ్” విడుదలైన తర్వాత దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నడు. రాఖీ బాయ్ గా యాశ్ అందరూ అభిమానులను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ సెపరేట్ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో కూడా తిరుగులేని మార్కెట్ ఇప్పుడు యాష్ కి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు “కేజిఎఫ్” సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్- 2” వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్టు సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మరియు తుఫాన్ సాంగ్…కూడా అదరగొట్టే విధంగా ఉండటంతో కేజీఎఫ్ చాప్టర్- 2 ఎన్ని రికార్డులు సృష్టిస్తున్న అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
“కేజిఎఫ్” మొదటి పార్ట్ తెలుగులో 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం తో… రెండో భాగానికి సంబంధించి 50 కోట్లకు పైగా రైట్స్ తెలుగులో పలకటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కన్నడ లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నంబర్ వన్ స్థానంలో ఉన్న యాష్ ఈ సినిమాతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అన్నది.. సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. “కేజీఎఫ్ చాప్టర్- 2” పూర్తి రన్ టైమ్ చూసుకుంటే..168.06 నిమిషాలు అంటే రెండు గంటల 48 నిమిషాల 6 సెకన్లు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాలకు సంబంధించి “కేజీఎఫ్ చాప్టర్- 2”. ఏప్రిల్ 14 వ తారీకు దేశ ప్రపంచ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి మొదటి భాగం మాదిరిగా సెకండ్ పార్ట్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.