NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 31 Today Episode: రక్త సంబంధం అంటే ఇదే కాబోలు..ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ.. టెన్షన్ లో సౌర్య..!

Karthika Deepam Mar 31 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో నిరుపమ్ చెప్పిన మాట ప్రకారం హిమను తనతో తీసుకుని వెళ్తుంది.నాలుగు రోజుల్లో తన భయం, పిరికి తనం అన్నీ పోగొట్టేస్తాను’ అంటూ నిరూపమ్ కు చెబుతుంది.హిమ భయపడుతున్నా సరే తన ఆటోను హిమతో నడిపిస్తుంది జ్వాల.ఇక ఆటో నడిపే క్రమంలో జ్వాల అన్నా మాటలకూ తన చిన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని బాగా ఏడుస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా సరిగ్గా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది. ఏడుస్తున్న హిమను చూసి జ్వాల చాలా. కంగారుపడుతుంది.

Karthika Deepam Mar 30 Today Episode: తింగరి ఎవరు అనేది సౌర్యకు తెలిసిపోయిందా.. తనపై కోపాన్ని ఇలా తీర్చుకొనుందా..?

Karthika Deepam Mar 31 Today Episode: హిమను ప్రేమగా చూసుకుంటున్న జ్వాల :

ఆటో ఆపి ఓ టిఫిన్ బండి దగ్గరకు హిమను తీసుకుని వెళ్తుంది. అక్కడో అబ్బాయి ఉంటాడు.అతనిని జ్వాల హే ‘రవ్వ ఇడ్లీ’ అని పిలుస్తుంది ఆ పేరుతో పిలవడం విన్న హిమ ఏంటి ‘రవ్వ ఇడ్లీనా.. అదేం పేరు’ అంటుంది.‘అదంతేలే వాడి పేరు అదే అంటూ రవ్వ ఇడ్లీ దగ్గరకు రాగానే అతనికి హిమనుపరిచయం చేసి ఈమె మన కొత్త దోస్త్.. వెళ్లి రెండు టీ తీసుకునిరా’ అంటుంది. ఇక అతని చేతిలో ఉన్న నీళ్లు మగ్గును జ్వాల తీసుకుని పద తింగరి.. ముఖం కడుక్కో.. ఏడ్చి ఏడ్చి ముఖం చూడు ఎలా అయిపోయిందో అంటూ హిమని పక్కకు తీసుకుని వెళ్లి తనే ముఖం తడి చేత్తో తుడుస్తుంది. హిమ చేతులు కడిగిస్తుంది. అది చుసిన హిమ చాలా ఎమోషనల్ అవుతుంది.

Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!
సౌర్య కోసం సౌందర్య వెతుకులాట :

ఇక సీన్ కట్ చేస్తే గతంలో సౌర్య వచ్చిన గుడి దగ్గరకు సౌందర్య కారు వచ్చి ఆపుతుంది. ‘అప్పుడప్పుడు సౌర్య ఈ గుడికి వస్తుందేమో ఇక్కడ ఎవరిని అన్నా అడిగితే సౌర్య జాడ తెలిసే అవకాశం. ఉండవచ్చు అని సౌర్య చిన్నప్పటి ఫొటో చూపించి తనని మీరు చూశారా?’ అంటూ అడుగుతూ ఉంటుంది. ‘తెలియదు’ అని కొందరు అంటే ‘చిన్నప్పటి ఫొటో చూపిస్తే ఎలా గుర్తుపడతాం అని మరికొందరు అంటారు. ఇక సౌందర్య ఆ మాటలకూ డీలా పడిపోతుంది.ఏడుస్తూ దేవుడి ముందుకు నిలబడి సౌర్యను ఎలా కనిపెట్టాలి దేవుడా.. అది ఎలా ఉంటుందో తెలియదు అనుకుని ఈ నాన్నమ్మని ఎప్పుడు కలుస్తావే సౌర్య అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది.

Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!
రవ్వ ఇడ్లీని డాక్టర్ చదివిస్తున్న సౌర్య:

మళ్ళీ సీన్ హోటల్ దగ్గర ఓపెన్ అవుతుంది.ఒక బల్లపై ఇద్దరు కుర్చీని ఉంటారు. ఇంతలో హిమ అసలు ‘ఇలాంటి పేర్లు ఎలా పెడతారండీ.. రవ్వ ఇడ్లీ? అంటూ ఉంటే కొత్తగా బాగుంది అంటుంది జ్వాలతో.నాతో ఉంటే అలానే ఉంటుంది బాగుంది కదా పేరు.. సరేలే ఓ సారి పిలు వాడ్ని రవ్వ ఇడ్లీ అని.. నీకు ధైర్యం పెరుగుతుంది’ అంటుంది జ్వాల నవ్వుతూ..అమ్మో వద్దులెండి’ అంటుంది హిమ కంగారుగా.. ‘పిలు ఓసారి’ అంటూ గట్టిగా అనడంతో హిమ భయపడిపోయి ‘రవ్వ.. ఇడ్లీ..’ అని గట్టిగా అరిచేస్తుంది. దాంతో అక్కడున్నవాళ్లంతా హిమ వైపు చూస్తారు. దాంతో రవ్వ ఇడ్లీ.. హిమ, జ్వాలల దగ్గరకు వస్తాడు. ‘రేయ్ రవ్వ ఇడ్లీ.. ఈమె ఎవరో తెలుసా? అని డాక్టర్ అని చెబుతుంది వాడు షాక్ అవుతాడు.హిమతో ‘వీడికీ డాక్టర్ అవ్వాలని కోరిక ఒకరకంగా చెప్పాలంటే టిఫిన్ బండికి వీడే ఓనర్ చదువుకుంటూ దీన్ని నడుపుతున్నాడు.. నేనే వీడ్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివిస్తున్నా’అంటుంది‘నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావ్.. బాగా చదువుకో’ అంటుంది.

నాతో పాటే ఉండిపోరా అని అడిగిన అమ్మ మాటలను ప్రేమ్ వింటాడా.?

సీన్ కట్ చేస్తే ప్రేమ్ స్వప్న ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చుని హిమ ఫొటోలు చూసుకుంటూనే ఉంటాడు.అది చుసిన స్వప్న రేయ్ ప్రేమ్ రమ్మనిపిలిస్తే ఏంటమ్మా అని అడగకుండా అలా నీ పని నీదే అన్నట్లు ఉంటావేంట్రా’ అంటుంది స్వప్న విసుగ్గా. ‘చెప్పు మమ్మీ అంటాడు ఫోన్ చూసుకుంటూనే దాంతో స్వప్న ఫోన్ లాక్కుని ‘రేయ్.. నువ్వు నా దగ్గరే ఉండరా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటుంది.వెంటనే తన ఫోన్ తీసుకోని మమ్మీ ఇదే విషయం అయితే పెద్దగా నేను చెప్పేదేమీ లేదు.నువ్వు ఎన్ని సార్లు అడిగినా నేను రాను అనే చెప్తాను. అయినా నువ్వు ప్రేమల గురించి చెప్పడం ఏంటి మమ్మీ విచిత్రంగా అంటాడు.నీకు నేను ఎలాగో అమ్మమ్మకి నువ్వు కూడా అంతే కదా మమ్మీ.? అయినా నేను నీ దగ్గరకి వచ్చేస్తే.. డాడీని ఎవరు చూసుకుంటారు? వద్దు మమ్మీ నేను రానుఅంటూ తన స్టైల్‌లో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్ కోపంగా.స్వప్న మాత్రం కాస్త ఎమోషనల్‌గా నిలబడిపోతుంది.

Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?
ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ :

మరోవైపు సౌర్య హిమని ఆటోలో వెనుకే కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటుంది. అదే దారిలో సౌందర్య కారు ఆపి సౌర్య చిన్ననాటి ఫొటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటుంది. అయితే హిమ ప్రతిసారి జ్వాలను అండీ అండీ అంటూ పిలవడంతో అలా అనొద్దు అంటుంది జ్వాల. అయినాగాని అలాగే అండి అంటుంది.విసుగుపుట్టిన జ్వాల.. ఆటో ఆపేసి.. వెనుకే కూర్చున్న హిమను కోపంతో తిట్టేస్తుంది. జ్వాల అలా తిట్టేయడంతో హిమ తల పట్టుకుని.. ‘నాకు కళ్లు తిరుగుతున్నాయండి’ అంటూ ఓ పక్కకు వాలిపోతుంది. దాంతో జ్వాల వామ్మో దీనికి ఏదో అయ్యింది’ అంటూ చాలా కంగారుపడిపోయి బాటిల్ లో ఉన్న నీళ్లు హిమ ముఖంపై కొడుతుంది. అప్పుడే సౌందర్య.. జ్వాల ఆటో వైపు వస్తూ ఉంటుంది.సౌర్యను, హిమను చూస్తుందేమో అనేంత ఆసక్తిగా సీన్ ఉంటుంది. కానీ సౌందర్య మాత్రం జ్వాల ఉన్న వైపు కాకుండా పక్కకు వెళ్లిపోతుంది.

హిమకు పెళ్లి కళ రానుందా..?

ఇక హిమ తేరుకోవడంతో జ్వాల సంతోషిస్తుంది. ‘వామ్మో నువ్వు మరీ ఇంత సుకుమారమా..’ అంటూ ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘కొంచెం నెమ్మదిగా పోనివ్వండి’ అంటుంది హిమ.ఇక రాత్రి అవ్వడంతో ఆనందరావు, సౌందర్యలు మాట్లాడుకుంటూ ‘ఇంట్లో సంతోషాలే లేకుండా పోయాయి’ అంటూ తన బాధని భార్యతో పంచుకుంటాడు ఆనందరావు.తిరిగి ఇంట్లో ఆనందాలు రావాలంటే.. అది హిమ పెళ్లితోనే సాధ్యం’ అంటాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju