Balakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలయ్య బాబు మంచి జోరు మీద ఉన్నారు. 2021లో “అఖండ” బ్లాక్ బస్టర్ తర్వాత 2022 ఏ సినిమా విడుదల చేయలేదు. కానీ ఆ ఏడాది “అన్ స్టాపబుల్” అనే టాకీ షో ద్వారా తనలో ఉన్న మరో కోణాన్ని బయట పెట్టడం జరిగింది. ఈ షోకి హోస్ట్ గా బాలకృష్ణ వ్యవహరించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. దీంతో దేశంలోనే “అన్ స్టాపబుల్” టాకీ షో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దేశంలో నెంబర్ వన్ టాకీ షోగా నిలిచింది. ఆ తర్వాత 2023 ఏడాది రెండు సినిమాలు విడుదల చేసి సూపర్ డూపర్ హిట్ అందుకోవటం జరిగింది.
సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” దసరా పండుగకు “భగవంత్ కేసరి” సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కాదా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నరు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణకి జోడిగా నాని హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే నాని కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జెర్సీ లో నటించిన శ్రద్ధ శ్రీనాథ్… బాలకృష్ణతో నటించిన రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఆమె సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దీనిలో భాగంగా విలన్ హీరోల మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 1980 నాటి కథతో ఈ సినిమాలో బాలకృష్ణని రెండు రకాలుగా దర్శకుడు బాబి చూపించబోతున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వేసవికాలంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలోbబాలకృష్ణని చాలా పవర్ ఫుల్ రోల్ లో బాబీ చూపించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.