Allu Arjun: ఈనెల 8వ తారీకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. దీంతో ఆరోజు “పుష్ప” సెకండ్ పార్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. “పుష్ప 2 ది రూల్” పేరిట ఏప్రిల్ 8వ తారీకు బన్నీ బర్త్ డే కానుకగా టీజర్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా “పుష్ప” సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి భాగం 2021లో విడుదలయ్యి సెన్సేషన్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో అల్లు అర్జున్ గ్రాఫ్ దేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది.
“పుష్ప” రాకముందు వరకు సౌత్ ఇండియాలో మాత్రమే అల్లు అర్జున్ కి మార్కెట్ ఉండేది. తెలుగుతోపాటు మలయాళం లో బన్నీ సినిమాలకు విపరీతమైన క్రేజ్. కానీ ఎప్పుడైతే “పుష్ప” వచ్చిందో… అల్లు అర్జున్ సరిహద్దులు విస్తరించాయి. దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల “పుష్ప” సినిమాకి గుర్తింపు లభించింది. “పుష్ప” మొదటి భాగంలో డైలాగులు, పాటలు, డాన్స్ అన్ని ఎలిమెంట్స్.. దేశాలతో భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం జరిగింది. ప్రపంచంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తగ్గేదేలే డైలాగ్ తో… సోషల్ మీడియాలో చాలామంది వైరల్ అయ్యారు.
దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ చాలా కేర్ తీసుకోవడం జరిగింది. మొదటి భాగం కంటే రెండో భాగం అంచనాలను అందుకునే విధంగా… స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేసి మొదటి భాగం హిట్ అయిన ఏడాదిన్నర తర్వాత రెండో భాగం షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు తేది దగ్గర పడుతూ ఉండటంతో తాజాగా అల్లు అర్జున్ జన్మదినోత్సవం వస్తూ ఉండటంతో. కామన్ డిస్ ప్లే పిక్చర్…(CDP) విడుదల చేయడం జరిగింది. బ్లాక్ కళ్లద్దాలతో బ్లాక్ డ్రెస్ లో.. రెడ్ కోర్ట్ పట్టుకొని.. అల్లు అర్జున్ దిగిన ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటోకి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది.