Mahesh Babu Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా విభిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎక్కువగా ఓపెన్ కారు. ఇతరులను పొగడాలన్న వ్యక్తి పూజ చేయాలన్న బాలకృష్ణ వ్యక్తిత్వంలో అలాంటి కోణం ఉండదు. కేవలం తన సినిమా దర్శకులను యూనిట్ సభ్యులను సందర్భానుసారంగా ప్రశంసిస్తారు. కానీ మొట్టమొదటిసారి “అన్ స్టాపబుల్” షోలో ఓపెన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని అన్నారు. ప్రస్తుతం మూడో సీజన్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. హోస్ట్ గా బాలకృష్ణ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
నటుడిగా మాత్రమే అలరించిన బాలయ్య యాంకరింగ్ యాంగిల్ లో… ఇతర హీరోల అభిమానులకు కూడా తెగ నచ్చేసాడు. బాలకృష్ణ తనదైన ఎనర్జీతో విజయవంతంగా ఈ షో రెండు సీజన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ క్రమంలో మూడో సీజన్ జరుగుతూ ఉండటంతో… షోలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్, శ్రియ శరణ్, సుహాసిని హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ తన అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పారు. అవార్డుల ప్రస్తావన వచ్చిన సమయంలో నేను అవార్డును నా అభిమాన హీరో మహేష్ బాబుకి ఇద్దాం అనుకుంటున్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు.
దాంతో బాలయ్య ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “అన్ స్టాపబుల్” షో … మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే మరోసారి మహేష్ ఈ షోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. “గుంటూరు కారం” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ మరియు మహేష్ ఈ షోకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.