NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

దీపావళి ఆగితే “శివకాశీ”లో ఎన్ని గుండెలు ఆగుతాయో..? ఎన్ని కడుపులు కాలుతాయో..!?

 

 

దీపావళి పండగను ఆసేతు హిమాచలం ఘనం గా జరుపుకుంటారు. పేద వారి నుండి ధనికుడు వరకు ఎవరికి తగినట్టు గా వాళ్ళు పండగను జరుపుకుంటూ ఉంటారు. హిందువులు దీపాలు వెలిగించి లక్ష్మి పూజ చేసుకొని టపాసులు కాల్చుకుంటారు. మిగితా మతస్థులు కుటుంబం తో కలిసి టపాసుల్ని కాల్చి పండగను జరుపుకుంటారు ప్రతి ఏటా. అందుకే ఈ పండగను సర్వమత సమ్మెళనం అంటారు. మరి ఈ సంవత్సరం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది, కరోనా విజృంభించిన వేళ వ్యాపారాలు, ఉద్యోగాలు లేక పేద, మధ్య తరగతి వారు ఆర్ధికం గా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమయంలో పండగని జరుపుకోవడానికి ప్రజలు అంత ఆసక్తి చూపకపోగ, వాయు కాలుష్యం కారణముగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి నాడు టపాసులు కాల్చడాన్ని నిషేధించాయి. అయితే బాణాసంచా కి ప్రఖ్యాతిగ ఉండే శివకాశి, టపాసుల నిషేధం తో ఎన్నో కష్టాల్ని ఎదురుకుంటుంది.

 

టపాసులు మేడ్ ఇన్ శివకాసి:
చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఎంతో సంతోషంగా టపాసుల్ని కాలుస్తుంటారు. దేశంలో 80%
బాణాసంచా ఇక్కడే తయారు అవుతుంది. అందుకే శివకాశి మినీ జపాన్ గా పేరుపొందింది. ఎంతో కాంతివంతంగా రకరకాల రంగుల కాంతులతో టపాసుల్ని తయారు చేసే కార్మికుడు జీవితం మాత్రం చీకటిలో మిగిలిపోతుంది. నెలకు 10,000 కూడా జీతం లేని ఉద్యోగం, ప్రతి రోజు చావు బ్రతుకుల మధ్య పోరాటం, ఉద్యోగ భద్రత ఇన్సూరెన్సు లు ఉండవు, ప్రభుత్వం అసలే పటించుకోదు, ఇక్కడ కార్మికులకు టీబీ, ఆస్తమా సర్వసాధారణం. అయినా కూడా అక్కడ నిరుద్యోగం అనే మాటే లేదు, ఆ ప్రదేశం ఏదో కాదు బాణాసంచా పారిశ్రామలతో అభివృద్ధి చెందిన శివకాశి. ఒక వైపు వేళ్ళ కోట్ల బిజినెస్ జర్గుతున్నపటికి అక్కడి కార్మికులు మాత్రం ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఏ క్షణం ఏమి జరుగుతుంధో అనే భయం తోనే బ్రతుకుతుంటారు. శివకాశి లో 700 బాణాసంచా పరిశ్రమలు ఉన్నాయి వీటిలో చాల మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాణాసంచా అమ్మకాలు ₹ 6,000 కోట్లు జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి బాణాసంచా తయారీ చేయడం వచ్చు. ప్రతి సంవత్సరం కూడా నిషేధ ఆజ్ఞలతో సవాళ్ళను ఎదురుకొన్ని తట్టుకొని నిలబడతారు బాణాసంచా తయారీ కార్మికులు. కానీ ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం తో ఎన్నో పరిశ్రమలు మూతపడాయి. దీనితో పాటు దీపావళికి కొన్ని రోజులు ముందుగానే , దేశంలోని పలు రాష్ట్రాలు టపాసుల అమ్మకాలు కాలచడం వంటి వాటి మీద నిషేధ ఆజ్ఞలు విధించాయి. దీనితో పరిశ్రమలు చాల మూత పడిపోవాల్సిన పరిస్థి ఏర్పాడింది , ఈ కారణంగా బాణసంచా కర్మాగారాల్లో పనిచేసే దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్రాలు నిషేధ ఆజ్ఞలు విధించడం తో ముందుగా డబ్బులు ఇచ్చి టపాసులు బుక్ చేసుకున్న డీలర్లు డబ్బు వాపసు చేయాల్సింది గా పరిశ్రమల మీద ఒత్తిడి తెస్తున్నారు. దీనితో చాలా పరిశ్రమలు నష్టాలలో మునిగిపోయాయి.

 

బాణాసంచా నిషేధ ఆజ్ఞలు:
దేశంలోని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు, వాయు కాలుష్యం పెరిగిపోవడం గాలి నాణ్యత లోపించడం తో దీపావళి నాడు టపాసుల్ని కాల్చడానికి వీలు లేదు అన్ని నిషేధ ఆజ్ఞలు విధిస్తున్నట్లు, ట్రైబ్యూనల్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.ఢిల్లీ , ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల టపాసుల అమ్మకాలు, వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ) సంపూర్ణ నిషేధం విధించింది. అక్కడ ఎవరు అయినా టపాసుల ఏమైనా కాల్చిన భారీ జరిమానాలు విధిస్తాం అన్ని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రైబ్యూనల్‌లో పిటిషన్‌ దాఖలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణ స్థితికి పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులపై నిషేధం విధించింది. ఈ నిషేధ ఆజ్ఞలను వాయు కాలుష్యం నియంత్రిచడం కోసం ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండగ కోసం సంవత్సరం నుండి ఎదురు చూస్తున శివకాశి కార్మికులు ఆశలు అన్ని ఆవిరి అయిపోయాయి, ఈ సంవత్సరం దీపావళి వాలా జీవితాలలో చీకటిని మిగిల్చేసింది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju