శివ నిర్వాణ టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తో నిన్నుకోరి, నాగ చైతన్య – సమంత లతో మజిలీ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా డీల్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. రీతువర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షైన్స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాని ప్రీ సమ్మర్ అంటే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా ఏప్రిల్ తర్వాత మొదలవబోతుందని త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందని సమాచారం. అయితే ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అన్నప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
విజయ్ దేవకొండ ని ఎలా చూపించబోతున్నాడు దర్శకుడు అని. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రొమాంటిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ తీసే సినిమాలు కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలు. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే విజయ్ దేవరకొండ గీత గోవిందం లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా 100 కోట్ల కి పైగా వసూళ్ళు రాబట్టింది. కాబట్టి అలాంటి జోనర్ అయి ఉంటుందేమో అని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి విజయ్ ని శివ నిర్వాణ ఎలా చూపించబోతున్నాడో.