న్యూస్

జగమంత కుటుంబం లో ఏకాకి అయిన మంత్రి ఎవరు?

Share

నెల్లూరు జిల్లాలోని బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఆ జిల్లా లో రాజకీయ చక్రం తిప్పే పవర్ఫుల్ రెడ్లు తమ తడాఖా చూపినట్టు కనిపిస్తోంది.

Who is the lone minister in the Jagamanta family
Who is the lone minister in the Jagamanta family

దీంతో మంత్రి గా ఉన్నప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ హవా పూర్తిగా తగ్గిపోయినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.రెడ్డి సామాజిక వ‌ర్గానికి కంచుకోట వంటి నెల్లూరులో అనిల్ త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పడాన్ని రెడ్డి వ‌ర్గానికి చెందిన కీల‌కనాయ‌కులుస‌హించ‌లేకపోయారని,వారంతా కూటమి గట్టి అనిల్ కుమార్ ను అణి చేశారంటున్నారు.నిన్న మొన్నటి వరకు అనిల్ కుమార్కు కాస్త అండగా వుంటూ వచ్చిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన దారి తాను చూసుకున్నాడని,దీంతో మంత్రి ఏక నిరంజనయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అనిల్ కుమార్ వరుస విజయాలు సాధించటం, పైగా వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపిని గట్టిగా ఢీకొనడంతో జగన్ ఆయనకు నెల్లూరు జిల్లాలో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను కాద‌ని బీసీ కోటాలో మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. దీంతో అనిల్ జిల్లాలో త‌న విశ్వరూపం చూపారు.ఎవర్నీ లెక్కచేయని రీతిలో ఆయన వ్యవహరించటం ,ముఖ్యంగా రెడ్డి శాసనసభ్యులను తొక్కిపెట్టటం,అధికారులను తన ఆధీనంలో ఉంచుకోవడం వంటివి చేయడం ద్వారా ఆయన అందరికీ దూరమయ్యారు.అనిల్ కుమార్ వైఖరిపై మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి బహిరంగంగానే ధ్వజమెత్తడం ఈ సందర్భంగా గమనార్హం.

ఇక‌, కోవూరు ఎమ్మెల్యే ప్రస‌న్న కుమార్ రెడ్డి, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి కూడా ఇదే ధోర‌ణిలో ఉన్నారు.వీరంతా ఒక జ‌ట్టుగా ముందుకు క‌దులుతున్నారు. ఇక‌, అనిల్‌తో నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా క‌లిసి మెలిసిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కూడా ఇటీవ‌ల కాలంలో అనిల్‌కు దూర‌మ‌య్యార‌నే వార్త‌లు వస్తున్నాయి.దీంతో జగమంత కుటుంబంలో అనిల్ కుమార్ ఒక్కడు ఏకాకి అయ్యాడని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు !


Share

Related posts

న‌వ్వుల వ్యాక్సిన్ తెస్తానంటున్న అనిల్ రావిపూడి!

Teja

జగన్ ముందు పెద్ద చిక్కుముడి పెట్టిన పార్టీ సీనియర్ లు .. ఎలా తెగ్గొట్టాలో తెలియడం లేదు !

sridhar

Jagga Reddy: కరోనా వేళ తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక నిర్ణయం..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar