NewsOrbit
వ్యాఖ్య

భారతంలో విరాట పర్వం

ఏ దేశ  చరిత్ర చూసినా  ఎవున్నది గర్వకారణం అన్నారు శ్రీ శ్రీ
ఏ పేపరు చదివిన ఏవుంది
దొంగతనాలు, దోపిడిలు, హత్యలు, ఆత్మహత్యలు
మానభంగాలు, లైంగిక దాడులు ఇవే
National crime bureau records సర్వే ప్రకారం మన రాష్ట్రంలో రెండేళ్లలో జరిగిన మానభంగాలు
లైంగిక దాడులు సంఖ్య 2385  మాత్రమే.

ఇది రెండేళ్ల కిందటి సర్వే
రెండేళ్లు ఎందుకు చెప్పలేదు అదేవైనా ఓల్డ్ వైనా
దేశంలో మనదే మొదటి స్థానం
భేష్ నోబెల్ ప్రైజు ఇవ్వాలి
టెక్నాలజీ పెరిగింది నేరాలు కూడా పెరగాలి కదా
అల్ట్రామోడెర్న్ అయిపొయాం
మహిళాభ్యుదయం  మహిళా ధికారత  అన్నిరంగాల్లోమహిళలు ముందుండాలి అని ఉపన్యాసాలు ఇచ్చే వారు జవాబు ఏవిటి చెప్తారు
అసలు ఇవి జరిగేది ఆడవాళ్ల మీదే
నేను పాత రోజులు చెప్పను

పాతికేళ్ల కింద ఇలాటివి విన్నామా
ఇవన్నీ టీవీలు కంప్యూటర్లు సీరియళ్లు వచ్చేక ఎక్కువ అయ్యేయి
ఓపన్నెండేళ్ల కుర్రాడు ఆరు ఏళ్ళ పిల్లమీద లైంగిక దాడి చేసేడు
వాడికి ఏవి తెలీదు ఎక్కడో చూసేడు ఇంట్లోనో వెబ్ లోనో
అదొక ఆట  అనుకున్నాడు అంతే
వెబ్ పుణ్యాన పిల్లలు సెక్స్ సినిమాలు చూస్తున్నారు
పదహారేళ్ళకుర్రాడు డెబ్భైయేళ్ల ఆవిడని మానభంగం చేసేడు
వీధిలో ఆడుతున్న చిన్నపిల్లపై ఒకడు దాడి  చేసేడు
ఒకటా  రెండా  ఇవి కోర్టుకి రావు
కోర్టుకి సాక్ష్యం కావాలి ఎవడూ పది మంది చూస్తుండగా చెయ్యడు
ఆ అమ్మాయి చెప్పిందే సాక్ష్యం అది ఎవరూ నమ్మరు
పైగా కోర్టులో అడిగే అసహ్యపు ప్రశ్నలకి అమ్మాయి తల  ఎత్తలేదు
గమ్మత్తు ఏవిటంటే మానభంగం జరిగిన ఆడదాన్ని పతిత అని ముద్ర వేస్తారు
పతితకి పతివ్రతకి ఒక అక్షరం తేడా ఆ అక్షరం మొగాడు
మొగాడు హాయిగా తిరుగుతాడు
ఆ అమ్మాయికి పెళ్లి కాదు
పెళ్లి అయిన వాళ్ళకి కాపురం గంగలో కలుస్తుంది
ఇవి social evils
శరీరానికి జబ్బు చేస్తే టెస్టులు చేసి వైద్యం చేస్తారు
ఇది సమాజానికి పట్టిన జబ్బు
కారణాలు వెతికి వైద్యం చెయ్యాలి
వీటికి గవర్నమెంట్ ఏవి చెయ్యలేదు
పోలీసులు కూడా చెయ్యలేరు

అయినా ఈమధ్య ఆడపిల్లల్ని అల్లరి పెట్టకుండా షీటీమ్స్ పెట్టేరు
కొంత వరకు మంచిదే కానీ వీటిని ఆపే  ప్రయత్నం చెయ్యాలి
వీరేశలింగంలాటి సంఘ సంస్కర్తలు లేరా
మేధావులు సైకాలజిస్టులు స్త్రీవాదులు కొంతమంది అలోచించి పరిష్కారం చెప్పాలి
ప్రతి సమస్యకి పరిష్కారం  ఉంటుంది
ఆలోచించాలి అంతే
ఎవరికీ లేని బాధ నీకెందుకమ్మా అంటారు పిల్లలు
కానీ రచయితకి సమాజంపట్ల బాధ్యత ఉంటుంది అన్నాడు గోర్కీ
డికెన్స్ రచనలవల్ల ఇంగ్లండ్‌లో చాల సంస్కరణలు జరిగేయి
రష్యన్ విప్లవంలో రచయితల పాత్ర ఉంది
ఫ్రెంచ్ విప్లవంలోనూ వాల్టేర్  రూసోల రచనల  ప్రభావం ఉంది
మనం అంత వాళ్ళం కాదు కానీ ఉడతా  సాయం చెయ్యవచ్చు,
ఏమంటారు

కలకంఠి కంట కన్నీరు ఒలికితే సిరి ఇంట నొల్లదు అన్నారు
ఇప్పుడు ఒలికేది కన్నీరు కాదు రక్తం ఇది ఒలికితే ఏమౌతుందో
మనల్ని మనమే బాగుచేసుకోవాలి ఆడ  మొగ  ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి
లేకపోతే జంతువులకి మనకి తేడా ఉండదు
అసలు జంతువులకి సీజను ఉంటుంది అవి అప్పుడే జత కడతాయి
మొగాడికి  సీజను లేదు పిడికెడు బూడిద అయ్యే వరకు యావ పోదు
మనుషులం అనిపించుకుందాం
ఇంకా మనలో మానవత  మిగిలితే భావి తరాలు బాగుపడతాయి
యత్ర నార్యంతు పూజ్యతే అన్నారు
పూజ అక్కర్లేదు గాని పాడు చెయ్యకుండా ఉంటె చాలు
ఆడ జాతి  లేకపోతే సృష్టి ఆగిపోతుంది
సృష్టిని నాశనం చెయ్యవద్దు
ఇది నా  మనవి
నువ్వెవరు అంటారా
సాటి  ఆడదాన్ని

-బీనా దేవి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment