నాలో చిన్న లోపం ఉంది మరేంలేదు nobody is perfect
నాకు భక్తులంటే చిన్నపిసరు అసూయ, కొంచెం కోపం, రవ్వంత జాలి
వాళ్ళు వాళ్ళ బాధల్ని కష్టాల్ని సమస్యలని దేవుడికే వదిలేస్తారు నాలాగ పీక్కోరు
అంతా పైవాడి దయ మనచేతిలో ఏవీలేదు
చచ్చిపోతున్నాసరే డాక్టర్ కంటే దేవుడినే ఎక్కువ నమ్ముతారు
ఆఖరికి డాక్టర్లు కూడా మేము చెయ్యవలిసింది చేసి ఆపైన దేవుడి దయ మీ అదృష్టం అంటున్నారు.

ప్రతి ఆస్పత్రిలో గుడి ఉంటుంది.
పిల్ల పెళ్లి దేవుడు తల్చుకుంటే ఎంతసేపు క్షణాల్లో అయిపోతుంది.
లేకపోతే పిలక పీక్కున్నా అవదు.
ఈ ఫిలోసోఫీకి ఢోకా లేదు.
పిల్ల పెళ్లి దేవుడు తల్చుకుంటే ఎంతసేపు క్షణాల్లో అయిపోతుంది.
లేకపోతే పిలక పీక్కున్నా అవదు.
ఈ ఫిలోసోఫీకి ఢోకా లేదు.
ఎవరి నమ్మకం వాళ్ళది
నమ్మకమంటే గురొచ్చింది
నాకు దేవుడు, దెయ్యం, ఆత్మ వగైరా నమ్మకం లేదని మావాళ్ళందరికీ తెలుసు
ఓసారి మానాన్న నన్ను పిల్చి సుందరం నువ్వు ఏవీ నమ్మవు కదా అంచేత ఈపుస్తకం చదువు
అని ఓ పుస్తకం ఇచ్చేరు.
నమ్మకమంటే గురొచ్చింది
నాకు దేవుడు, దెయ్యం, ఆత్మ వగైరా నమ్మకం లేదని మావాళ్ళందరికీ తెలుసు
ఓసారి మానాన్న నన్ను పిల్చి సుందరం నువ్వు ఏవీ నమ్మవు కదా అంచేత ఈపుస్తకం చదువు
అని ఓ పుస్తకం ఇచ్చేరు.
దాని పేరు lngersol lectures
ఆతను harward university లో లెక్చర్లు ఇచ్చేడు, అవన్నీ పుస్తకం వేసేరు
అందరి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని అతను నాకంటే ఘనుడు
ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని అందరు దేవుళ్ళని రాట్నం లేకుండా వడికేసేడు
చేట లేకుండా చెరిగేసేడు
ఎవరూ ఏవీ అనలేదు, అల్లరి చెయ్యలేదు
మరి వాళ్ళకి మనలాగా మనోభావాలు లేవా

ఉన్నా దెబ్బ తినలేదా
అదే వాళ్ళ గొప్పతనం
నేను మళ్ళీ దారి తప్పేను
నాకు ఒకటి అర్థం కాదు, ఒకటేవిటి చాల అర్థం కావు నెల తక్కువ పుట్టెనో ఏవిటో
అదే మా అమ్మని అడిగేను
నోర్ముయ్ పిచ్చి వాగుడు నువ్వూనూ అని తిట్టింది
సరే నోరు మూసుకుంటాను కానీ ఆలోచనలు మూత పడవే
పాపాలు చేస్తూ మోసాలు చేస్తూ పైకి భక్తులమని చెప్పేవాళ్ళని చూస్తే భయం వేస్తుంది
వాళ్ళు రోజూ రెండు పూటలా పూజ చేస్తారు తరవాత మాములే
నాకు దేవుడంటే భక్తి లేదు కానీ దేవుడి మీద జాలేస్తుంది, ఇన్ని పాపాలు మోస్తున్నందుకు
ఆమధ్య చదివేను వేదకాలంలో గుళ్ళు గోపురాలు లేవుట
కేవలం యజ్ఞాలు మాత్రమే ఉన్నాయి
పురాణకాలంలోనూ గుళ్ళు లేవు
రాముడు కృష్ణుడు ఉన్నా అప్పుడు వాళ్ళూ మనుషులే
తరవాత మనం దేవుళ్ళని చేశాం
దేవుడనేవాడుంటే ఒక్క గుళ్లోనే ఉండడు
ఇందుగలడందులేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అన్నాడు ప్రహ్లాదుడు
చెట్టు పుట్టతో సహా ప్రతిప్రాణిలోనూ దేవుడు ఉంటాడు
ఉంటే ప్రపంచం అంతటికీ ఒక్కడే దేవుడు
ఎవరి ఇష్టంవొచ్చిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు అంతే
అయితే దేవుడికి కూడా ప్రచారం అవసరమని నాకు ఈమధ్యే తెలిసింది
ఫలానా దేవుడిగుడికి వెళ్తే ట్రాన్స్ఫర్ అవుతుంది
ఫలానా గుడికి వెళ్తే వీసా వస్తుంది
ఫలానా అమ్మవారి గుడి దగ్గర చెట్టుకి ఉయ్యాలా కడితే పిల్లలు పుడతారు
డాక్టర్లకి ఉన్నట్టే దేవుళ్ళలోనూ స్పెషలిస్టులు ఉన్నారు మరి
దీపావళి నాడు రాత్రి దీపం ముందు కూర్చొని లక్ష్మీదేవి పూజ చేస్తే మర్నాడు పొద్దున్నే తలుపు తియ్యగానే పనిమనిషి బదులు లక్ష్మీదేవి కనిపిస్తుంది
పాపం ఒక్క సరస్వతికి ఎక్కువ గుళ్ళు లేవు ఎందుకూ
ఆవిడ జ్ఞానం ఇస్తుంది కానీ డబ్బు ఇవ్వదు
వెధవ జ్ఞానం ఎవడిక్కావాలి డబ్బు పారేసి కొనుక్కోవచ్చు
మొత్తానికి దేవుడు మార్కెట్లో వస్తువు ఐపోయేడు
డబ్బున్నవారికి స్పెషల్ దర్శనాలు. లేనివాడికి ధర్మదర్శనాలు
దేవుడి దగ్గర స్మశానంలోనూ అందరు సమానమే.
మరి ఈ అసమానతని నువ్వు మానిపించలేవా
యేవిటి నీచెయ్యి దాటిపోయిందా
ఐతే శుభ్రంగా మాయం అయిపో
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ