ఎప్పుడు యెడతెగక పారు ఏరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము అన్నాడు సుమతీశతకకారుడు
భూమిమీద 70 శాతం నీరే అంటుంది జాగ్రఫీ
ఔనే సుందరం అరుణ వాళ్ళ ప్లాట్ లో నీళ్లు లేవుట అంది మా అమ్మ, అదేదో వింత అయినట్టు
నేను ఏవి మాట్లాడలేదు
ఆచారి ఇంట్లో బోరు పాడయిందిట పాపం అంది ఆవిడే మళ్ళి
ఆవిడ అందరికి పాపాలు పెట్టేస్తుంది
పాడవక ఏంచేస్తుంది, దానికి నావయస్సు
నారుపోసినవాడు నీరు పొయ్యడా అనికాదూ ఇదివరకు రాసేను
కానీ పొయ్యడానికి నీరేది
ఒకప్పుడు ఊరినిండా చెరువులు చెట్లు ఉండేవిట
ఏవండీ అవన్నీ
కాశీ మజిలీ కథలో మనిషి చిలక అయినట్టు అవన్నీ బిల్డింగులు ఐపోయేయి
మరిప్పుడు ఓసారి పేపరు తిరగెయ్యండి
తాగడానికే నీరు లేక జనానికి నాలిక పిడచ కట్టుకుపోతోంది
మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటింది
ఇప్పటికీ నీరు లేని పల్లెలు ఎన్నో ఉన్నాయి
వాటికీ నీరు ఇవ్వవలసిన బాధ్యత ఎవరిది
మునిసిపాలిటిదా, గవర్నమెంటుదా, లేక దేవుడిదా
ఎవరిది అయినా ఫలితం ఒక్కటే
నీరు లేకపోతేనేం బీరు ఉంది కాదా
నీరులేని ఊరు ఉందేమో కాని బీరు లేని ఊరు లేదు
స్వతంత్రం రాకముందు మనకి బీరు విస్కీ లు లేవు
అప్పటి ప్రజలు నీతి నియమం పట్టుకొని వేలాడేవారు
ఇప్పుడు యువత కాలేజీలకు బార్లకు ఒక్కసారే పరిగెడుతున్నారు
సమాన హక్కుల పేరుతో అమ్మాయిలూ వెళుతున్నారు
ఇంతకీ నేను నీరు దగ్గర ప్రారంభించి బీరు దగ్గరకి వెళ్లిపోయేను
దీన్ని స్ట్రీమ్ అఫ్ consciousness అంటారట
పాపం బారులో కూడా ఆడవాళ్ళకి ఇతోధికంగా సాయం చేస్తున్నారు
మహిళా దినం నాడు ఆడవాళ్ళకి బీరు ఫ్రీగా ఇస్తారు
బావుంది కదూ
బీరు ఆడవాళ్ళ డ్రింకుట కిక్ ఉండదుట
డ్రింక్కి కూడా అడా మొగ తేడా ఉంది కాబోలు
ఇదండీ మన పురోగతి
ఇదే మన సంస్కారం
ఇవన్నీ మొదట థ్రిల్ గ్లామర్
తరవాత వ్యసనం ఆఖర్న స్మశానం
ఎండాకాలంలో బీరు ఏరులా పారింది
మనం అన్నిటిలోను ముందే ఉంటాం
దారిద్రశాతం ఎక్కువ అవినీతి ఎక్కువ
ప్రజల బలహీనతని కాష్ చేసుకుంటున్నాం
జబ్బులపాలు చేస్తున్నాం
ఈ పాపం ఎవరిది
డబ్బు అందరికి అవసరమే కానీ అన్యాయంగా అర్జించవద్దు
ఒకడు కోట్లు ఆర్జించడానికి ఎన్ని కోట్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయో ఆలోచించేరా
డబ్బు అందరికీ అవసరవే కానీ అన్యాయంగా అర్జించవద్దు
మనుషుల సమాధి మీద మేడలు కట్టొద్దు
అది శుభం కాదు మనకి కావల సింది బీరు విస్కీ కాదు
అన్నం నీళ్లు ఆలోచించండి
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ